నిజ జీవిత మామా..మేనల్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య తెరమీద కూడా అవే పాత్రలు పోషించబోతున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరి  కాంబినేషన్ లో సినిమా   కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు. కానీ మంచి కథ దొరక్క వారు ఇన్నాళ్లు కలిసి సినిమా చేయలేకపోయారు.  ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్ లో జై లవ కుశ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వెంకటేష్, నాగ చైతన్య ఒక మీడియం బడ్జెట్ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాని సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నారు.  

ఈ సినిమాని పిబ్రవరి 22 నుంచి రాజమండ్రిలో  రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. చిన్నప్పుడే తన కుటుంబం నుంచి విడిపోయిన చైతూ తిరిగి చాలా కాలం తర్వాత తన సొంత ఊరికి రావటం జరుగుతుంది. అక్కడ జరిగే సన్నివేశాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. 

కోన వెంకట్ ఫన్ని డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నట్లు సమాచారం. ఎఫ్ 2 చిత్రంలా ఇది ఓ కుటుంబ కధా చిత్రం అని, పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా నడుస్తుందని చెప్తున్నారు.  ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీతి సింగ్, వెంకటేష్ సరసన శ్రియ కనిపించనున్నారు.  

అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర టిపికల్ పల్లెటూరి మనిషి పాత్ర అని తెలుస్తోంది. అనుబంధాలకు,ఆత్మీయలకు,మర్యాదలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడని అమాయకత్వంతో కూడిన ఆ పాత్ర దృశ్యం సినిమాలో వెంకటేష్ ని గుర్తు చేస్తుందంటున్నారు.

చిన్నప్పుడే విడిపోయిన తన మేనల్లుడుని వెతుక్కుంటూ సిటీకు వచ్చే పాత్రలో వెంకటేష్ కనపడతాడని, అయితే అతనే తన మేనల్లుడు అని తెలియక ఇద్దరూ  పరిచయమైనా ఎవరో అన్నట్లు బిహేవ్ చేస్తారని చెప్తున్నారు. అందులోంచి పుట్టే ఫన్ ఫస్టాఫ్ ని హిలేరియస్ గా మారుస్తుందని చెప్తున్నారు. 

ఇక సెకండాఫ్ లో నాగచైతన్యను తమ గ్రామానికి తీసుకు వస్తాడని ...అక్కడ విలేజ్  లో పాత్రలతో నాగచైతన్య చేసే కామెడీ నవ్విస్తుందని చెప్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో వెంకికు, నాగచైతన్యకు ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత ఉంటుందంటున్నారు.