దగ్గుబాటి వెంకటేష్ అతడి మేనల్లుడు అక్కినేని నాగచైతన్య కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా మొదలుకావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన కళ్యాణ్ కృష్ణ తప్పుకోవడంతో దర్శకుడు బాబీ తెరపైకి వచ్చాడు.

సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవ వేడుక కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం కథే అని తెలుస్తోంది. సురేష్ బాబు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని అనుకున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అయితే బాబీ ఫైనల్ నేరేషన్ విన్న తరువాత నిర్మాతలకి కథ నచ్చకపోవడంతో సినిమాని ఆపేయాలని అనుకుంటున్నారట. సురేష్ బాబు కూడా ఈ సినిమాని పూర్తి స్థాయిలో నిర్మించడానికి సిద్ధంగా లేకపోవడంతో తాత్కాలికంగా ఈ సినిమాని నిలిపివేయనున్నారు. 

'వెంకీ మామ' సినిమా పట్టాలెక్కితే గనుక 'ప్రేమమ్' తరువాత మామ,అల్లుళ్లనిమరోసారి తెరపై చూసే అవకాశం వచ్చి ఉండేది. ప్రస్తుతానికైతే సినిమాను పక్కన పెట్టేశారు.