'తొలిప్రేమ' హిట్ తో వెంకీ అట్లూరి తో చేయాలని యంగ్ హీరోలు ఫిక్స్ అయ్యారు. వెంటనే అఖిల్ అడుగు ముందుకు వేసి ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. మూడు రోజుల్లో రిలీజ్ ఉంది. ఈ నేపధ్యంలో  వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండతో ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. 

మైత్రీ మూవీస్ వారు ఇప్పటికే వెంకి అట్లారి, విజయ్ దేవరకొండలను లాక్ చేసినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి ఫైనల్ నేరేషన్ ఇస్తే ....విజయ్ దేవరకొండ డేట్స్ ఇస్తారు. మిస్టర్ మజ్ను రిలీజ్ తర్వాత స్టోరీపై కూర్చుని విజయ్ దేవరకొండను కలుస్తాను అని వెంకీ అట్లారి చెప్పినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ సైతం మిస్టర్ మజ్ను రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక అఖిల్  హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై `తొలిప్రేమ` ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్ మిస్టర్ మజ్ను. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యుఎ స‌ర్టిఫికేట్‌ను ద‌క్కించుకుంది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి అద్భుత  స్పద‌న‌ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.