దృశ్యం సినిమా తరువాత నుండి ఒక రకంగా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు పోతున్న వెంకీ ఒక్కో సినిమా కి ఒక్కో కొత్త లుక్ ట్రై చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ వెంకీ ఈ సినిమాలో ఒక సాఫ్ట్ లుక్ ట్రై చేశాడు. దాన్ని ప్రేక్షకులకి సర్ప్రైజ్ రూపంలో ఇద్దాం అనుకున్నాడంట. మరి ఎవరు చేశారో తెలియదు కాని సినిమాలో వెంకీ లుక్ కి సంబంధించి ఒక ఫోటో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమై వైరల్ గా మారిపోయింది. విషయం తెలిసిన వెంటనే ప్రొడక్షన్ బ్యానర్ అయిన రామానాయుడు స్టూడియోస్ కి చేరుకున్నాడు వెంకీ. అక్కడ ఎవర్ని నిందించకపోయినా స్టాఫ్ అజాగ్రత్త కు వాళ్ళను మందలించాడంట.

ఆ పోస్టర్లో స్పెట్స్ పెట్టుకుని బ్యాగ్ తగిలించుకుని చేతిలో పుస్తకంతో వెంకీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. కొందరు సూపర్ అంటున్నా కొందరేమో రొటీన్ గా ఉంది అని తీసిపారేస్తున్నారు. మొత్తానికి అప్పుడే చూపించద్దు అనుకున్న లుక్ సోషల్ మీడియా పాలవ్వడం వల్ల వెంకీ హర్ట్ అయ్యాడట.