అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 మేకర్స్ కొత్త విడుదల తేదీ ప్రకటించారు. లేటైనా పోటీ లేకుండా ప్రశాంతంగా రావడం బెటరని డిసైడ్ అయ్యారు.  

అరడజనుకు పైగా పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. విడుదల తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతం రాగానే హడావుడిగా మేకర్స్ తేదీలు ప్రకటించారు. ముందుగా డేట్ బుక్ చేసుకోకుంటే తర్వాత ఖాళీ దొరకదనే ఆందోళనలో విడుదల తేదీలు నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో ఎఫ్ 3 యూనిట్ ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 29న చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య(Acharya) విడుదలవుతున్న నేపథ్యంలో కేవలం ఒకరోజు ముందు ఎఫ్ 3 విడుదల కావాల్సి ఉంది. 

ఆచార్య లాంటి భారీ చిత్రంతో పోటీపడడం ఎఫ్ 3 (F3)చిత్రానికి అంత మంచిది కాదు. ఒక్క రోజు వ్యవధిలో ఆచార్య విడుదల కారణంగా ఎఫ్ 3 టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఎఫ్ 3 మేకర్స్ విడుదల తేదీ వెనక్కి జరిపారు. ఏప్రిల్ 28కి బదులు మే 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు ఎఫ్ 3 కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేశారు. 

వెంకటేష్-వరుణ్ తేజ్ చేస్తున్న ఈ మల్టీస్టారర్ ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 భారీ విజయం సాధించింది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్స్ ని కూడా రిపీట్ చేశారు. తమన్నా, మెహ్రీన్ మరోసారి వెంకీ, వరుణ్ లతో జతకట్టనున్నారు.ఎఫ్ 2లో పెళ్లాల కారణంగా మొగుళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపించిన అనిల్ రావిపూడి.. ఎఫ్ 3లో మనీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ నుండి ఫన్ జనరేట్ చేయనున్నారు. 

Scroll to load tweet…

ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎఫ్ 3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎఫ్ 3 చిత్రంపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉండగా.. ఎఫ్ 3తో ఆయన తిరిగి మ్యాజిక్ రిపీట్ చేస్తారని గట్టిగా అనిపిస్తుంది. మే 27నాటికి పెద్ద చిత్రాల విడుదల పూర్తవుతుంది. కొంచెం లేటైనా ప్రశాంతంగా సమ్మర్ ని క్యాష్ చేసుకోవచ్చని ఎఫ్ 3 మేకర్స్ ప్రణాళిక వేశారనిపిస్తుంది. మే 17న మహేష్ సర్కారు వారి పాట విడుదల కానుంది.