బాలీవుడ్ చేరిన ఎఫ్ 2 సినిమా, హిందీలో రీమేక్ చేయబోతున్నస్టార్ ప్రొడ్యూసర్
తెలుగు సినిమా స్థాయి పెరిగినప్పటినుంచి మన సినిమాలపై గట్టిగా కన్నేశారు బాలీవుడ్ మేకర్స్. ఇటు మన వాళ్లు కూడా ఇక్కడి సినిమాలను బాలీవుడ్ కు తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
తెలుగు సినిమా స్థాయి పెరిగినప్పటినుంచి మన సినిమాలపై గట్టిగా కన్నేశారు బాలీవుడ్ మేకర్స్. ఇటు మన వాళ్లు కూడా ఇక్కడి సినిమాలను బాలీవుడ్ కు తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
టాలీవుడ్ కు పాన్ఇండియా ఇమేజ్ తో పాటు... ప్రపంచ వ్యాప్త గుర్తింపు కూడా లభించింది. ఈక్రమంలోనే బాలీవుడ్ తో పాటు..ఇతర భాషల మేకర్స్ మన తెలుగు కంటెంట్ మీద కన్నేశారు. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలు ఎలాగు పాన్ ఇండియాను ఆకర్షిస్తున్నాయి సరే.. కాని అంతకు ముందు తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యి.. హిట్ అయిన మంచి మంచి కథలను బయటకు తీస్తున్నారు. బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ మేకర్స్ మాత్రమే కాదు.. మనవాళ్లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్లుగా ఉన్న అల్లు అరవింద్.. దిల్ రాజు లాంటి పెద్దవాళ్లు.. టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ లో కూడా ఇప్పటికే సినిమాలు నిర్మిస్తూ.. మార్కెట్ ను పెంచుతున్నారు. ఈక్రమంలో వాటి స్పీడ్ పెంచి.. తెలుగు మార్కెట్ ను విసృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా...తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా కనిపించి ఆకట్టుకున్న సినిమా ఎఫ్2. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈసినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఎఫ్ 2 రిలీజ్ అయ్యింది. కామెడీ జోనర్ లో 2019లో ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక ఇటీవల దీనికి సీక్వెల్ గా రూపొందిన ఎఫ్ 3 సైతం సూపర్ హిట్ అందుకోవడం విశేషం. అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో ఎఫ్ 2 మూవీని బాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖ హీరోలతో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. అలానే ఈ మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అక్కడ కూడా తెరకెక్కించనున్నారట. కాగా ఈ క్రేజీ న్యూస్ పై మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ ప్రాజక్ట్ లో హీరోలు, హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.