Asianet News TeluguAsianet News Telugu

F3 Movie: ఎఫ్3 ప్రీ రిలీజ్ బిజినెస్... భారీ టార్గెట్ తో దిగుతున్న వెంకీ-వరుణ్! 

ఎఫ్3 మూవీ విడుదలకు సిద్ధం కాగా థియేటర్స్ లాఫింగ్ క్లబ్స్ గా మారిపోనున్నాయి. క్రేజీ సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

venkatesh varun starer f3 pre release business details
Author
Hyderabad, First Published May 25, 2022, 6:53 PM IST

వెంకటేష్-వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా ఎఫ్3 రికార్డులకు ఎక్కింది. ఏకంగా రూ. 70 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసింది. 2019లో విడుదలైన ఎఫ్ 2 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. రామ్ చరణ్, బాలయ్య చిత్రాలకు షాక్ ఇస్తూ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి కంప్లీట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. పెళ్ళాల కారణంగా మగాళ్లు పడే ఫ్రస్ట్రేషన్ ప్రధానాంశంగా ఆ చిత్రం తెరకెక్కింది. 

ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 (F3 Movie)తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ లో నటించిన వెంకీ, వరుణ్, తమన్నా(Tamannah), మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. అదనంగా సునీల్, సోనాల్ చౌహాన్ కలిశారు. విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఎఫ్ 3 థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు నైజాంలో స్వయంగా విడుదల చేస్తున్నారు. రూ. 21 కోట్లుగా నైజాం హక్కులు వెలగట్టారు. సీడెడ్ రూ.9.5 కోట్లకు అమ్మారు. 

ఏపీ/తెలంగాణా కలిపి రూ.60.5 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 4 కోట్లు, ఓవర్సీస్ రూ.5.50 కోట్లకు విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వెంకీ-వరుణ్ మార్కెట్ రీత్యా ఇది పెద్ద టార్గెట్ అని చెప్పాలి. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బ్రేక్ ఈవెన్ ఏమంత కష్టం కాదు. వేసవి సెలవులు కావడంతో పాటు పోటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. మరి చూడాలి ఎఫ్3 బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సత్తా చాటుతుందో... 

మే 27న ఎఫ్3 వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఒకరోజు ముందే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుంది. ఎఫ్3 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయడం మరో ప్రత్యేకత. 
 

Follow Us:
Download App:
  • android
  • ios