నాల్గో సినిమాకి వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌..ఈ సారి శేఖర్‌ కమ్ములతో..

ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న వెంకీ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. మంచి లవ్‌, ఫ్యామిలీ, ఎమోషన్స్ తో కూడిన కూల్‌ మూవీస్‌ తీసే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. 

venkatesh upcomming fourth movie with director sekhar kammula ? arj

విక్టరీ వెంకటేష్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. అదే సమయంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ షాక్‌ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌ `అసురన్‌`కి రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల రూపొందిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌. ఈ సినిమా మే 14న విడుదల కానుంది. మరోవైపు తనకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన `ఎఫ్‌2` సీక్వెల్‌ `ఎఫ్‌3`లో నటిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ మరో హీరో. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఆగస్ట్ 27న విడుదల కానుంది. 

దీంతోపాటు ఇటీవల `దృశ్యం 2` సినిమాకి ఓకే చెప్పారు. ఇది వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. దీన్ని జులైలోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. కానీ `ఎఫ్‌3` తర్వాతే విడుదలకు ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న వెంకీ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. మంచి లవ్‌, ఫ్యామిలీ, ఎమోషన్స్ తో కూడిన కూల్‌ మూవీస్‌ తీసే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. ఇటీవల వీరి మధ్య కథా చర్చలు జరుగగా, వెంకీ ఓకే చెప్పాడని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ వెంకీ స్పీడ్‌ చూస్తుంటే మిగిలిన హీరోలు షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవిలతో `లవ్‌స్టోరీ` చిత్రాన్ని రూపొందించారు. ఇది ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios