సక్సెస్ లేని హీరోకి ఒక్క సక్సెస్ అందితే ఎంత బిజీగా ఉంటాడో వెంకటేష్ ని చూసి చెప్పవచ్చు. F2 సక్సెస్ అనంతరం ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ప్రాజెక్టులను ఒకే చేస్తోన్న వెంకీ అన్నయ్య సురేష్ బాబు కొరికే మేరకు బాలీవుడ్ రీమేక్ దే దే ప్యార్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

అయితే కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఆ దర్శకుడు ఎవరా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూమర్స్ ప్రకారం సురేష్ బాబు శ్రీవాస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. లక్ష్యం సినిమాతో దర్శకుడిగా మరిచయమైన శ్రీవాస్ ఆ తరువాత రామ రామ కృష్ణ కృష్ణ - పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలతో ప్లాప్స్ అందుకున్నాడు. 

అనంతరం లౌక్యం సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ అందుకున్న శ్రీవాస్ నెక్స్ట్ సినిమాలతో మళ్ళీ ఫామ్ కోల్పోయాడు. డిక్టేటర్ - సాక్ష్యం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మరో సినిమాను సెట్ చేసుకోలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.