పవన్ కల్యాణ్  భీమ్లా నాయక్ ( Bheemla Nayak) మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ఉత్కంఠగా  ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ( Bheemla Nayak) మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

భీమ్లా నాయక్ ( Bheemla Nayak) రిలీజ్ కు రెడీగా ఉంది. కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ గురించి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా భీమ్లా నాయక్ ( Bheemla Nayak) ను విష్ చేస్తూ.. సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈరోజు (24 ఫిబ్రవరి) ఉదయం మంత్రి కేటీఆర్(KTR) భీమ్లా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిన్న జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వెళ్లారు. ఇక ఈరోజు కూడా కొంత మంది సెలబ్రిటీలు భీమ్లా నాయక్( Bheemla Nayak) టీమ్ కు ఆల్ ది బెస్ట చెపుతున్నారు.

ఈ నేపథ్యంలో అబ్బాయి రానా(Rana)కు బాబాయి వెంకటేష్(Venkatesh) సపోర్ట్ లభించింది. ఈ సినిమా గురించి హీరో వెంకటేశ్ స్పందించారు.భీమ్లా నాయక్ ( Bheemla Nayak) రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రోమోలు ట్రైలర్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. ఈ సినిమాతో పవన్, రానా ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు వెంకీ.

Scroll to load tweet…



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , రానా(Rana) హీరోలుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లానాయక్ మూవీలో సముద్రఖని,మురళీ శర్మ లాంటి సీనియర్లు నటించారు. భీమ్లా నాయక్( Bheemla Nayak) మూవీకి స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.

మొదటి నుంచి పవర్ స్టార్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ ( Bheemla Nayak) సినిమాను ఫిబ్రవరి 25న.. ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు 3 వేల థియేటర్లు.. 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో ఈమూవీ 5 షోలకు అనుమతి లభించింది. కానీ ఏపీలో మాత్రం ఇంకా పరిస్థితి అలాగే ఉంది. టికెట్ రేట్ల విషయంలో కాని.. బెనిఫిట్ షోల విషయంలో కానీ ఏపీలో మార్పు లేదు.