వరుసగా కమర్షియల్ సినిమాలు తీస్తూ హిట్టు మీద హిట్టు అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి వెంకీ, వరుణ్ తేజ్ లు హీరోలుగా 'ఎఫ్ 2' అనే సినిమాను తెరకెక్కించాడు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా విడుదల కాకుండా, రిజల్ట్ ఏంటో తెలియకుండానే దర్శకుడు అనీల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు హీరో వెంకీ. సినిమా ప్రమోషన్స్ లో వెంకీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఎప్పుడు వీరి కాంబో సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో స్పష్టతనివ్వలేదు.

'ఎఫ్ 2' షూటింగ్ సమయంలోనే వెంకీకి ఓ లైన్ వినిపించాడట అనీల్ రావిపూడి. లైన్ నచ్చడంతో కథ సిద్ధం చేయమని చెప్పాడట వెంకీ. కథ ఫైనల్ అయితే గనుక వీరి కాంబోలో సినిమా పక్కా. ప్రస్తుతం వెంకీ చేతిలో 'వెంకీ మామ' సినిమా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే అనీల్ రావిపూడి సినిమా ఉంటుంది.

ఇక 'ఎఫ్ 2' సినిమా  విషయానికొస్తే.. ఇప్పటివరకు సంక్రాంతి రేసులో విడుదలైన సినిమాలకు ఆశించి ఫలితం రాకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. కచ్చితంగా సినిమా సక్సెస్ అందుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. మరికొద్ది గంటల్లోనే సినిమా రిజల్ట్ తెలియనుంది.