విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 2' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. సినిమా సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ శాతం వెంకీకే దక్కుతుంది. అంతగా తన పెర్ఫార్మన్స్ తో నవ్వించాడు. ఫ్రస్ట్రేటడ్ భర్తగా వెంకీ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇప్పుడు మన నిర్మాతలు వెంకీ కోసం అటువంటి కామిక్ కథలు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు వెంకీ దృష్టి బాలీవుడ్ సినిమాపై పడిందని సమాచారం.

ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన 'దే దే ప్యార్ దే' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించాడు. కథ ప్రకారం విడాకులు తీసుకున్న యాభై ఏళ్ల వ్యక్తి పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడు. తన కొడుకు వయసున్న అమ్మాయితో హీరో ప్రేమ అనే కాన్సెప్ట్ బాలీవుడ్ లో బాగా క్లిక్ అయింది. 

ఇప్పుడు ఆ సినిమాను వెంకీ టాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. సురేష్ బాబు దీనికి సంబంధించి రైట్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అజయ్ దేవగన్ పాత్ర వెంకీకి బాగా సూట్ అవుతుందని భావిస్తున్నాడు. టాలీవుడ్ లో గనుక రీమేక్ చేస్తే వెంకీ ఓ కుర్ర హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!