వరుస అపజయాల అనంతరం F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే వెంకీ మాత్రం కథలు ఎంత నచ్చినా వెంటనే ఒప్పుకోవడం లేదు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే సెట్స్ పైకి వెళుతున్నాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో వెంకిమామ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

ఆ మల్టీస్టారర్ సినిమా హడావుడి మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. అయితే ఆ తరువాత వెంకటేష్ త్రినాథ్ రావ్ నక్కిన - తరుణ్ భాస్కర్ లతో వర్క్ చేయనున్నాడు. అయితే రీసెంట్ గా తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చారట. ఆ సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. 

పక్కా లోకల్ కంటెంట్ తెరపై కనిపించేలా దర్శకుడు హైదరాబాద్ రేస్ క్లబ్ (మలక్ పెట్) లో మేజర్ పార్ట్ ని తెరకెక్కించిననున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. డి.సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు. ఇక వెంకటేష్ వెంకీ మామ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది,