‘ఎఫ్‌2’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌..  ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య, వెంకటేష్‌ కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రఫ్ ఎడిట్ వెర్షన్ ని రీసెంట్ గా వెంకటేష్ చూడటం జరిగిందిట. అయితే ఆయనకు కొన్ని ఎపిసోడ్స్ నచ్చలేదట. ముఖ్యంగా ఈ సినిమాలో మిలిటరీ బ్యాక్ డ్రాప్ సీన్స్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నాయట.

కాశ్మీర్ లో తీసిన మిలటరీ సీన్స్ మరీ సీరియస్ గా ఉన్నాయని, వాటి టోన్ తగ్గించి, ఎంటర్టైన్మెంట్ పెంచమని కోరారట.  ఎందుకంటే తన సినిమా అంటే ఎంటర్ట్నైన్మెంట్ ఎక్కువగా ఆశిస్తారని ఆ యాంగిల్ లో మరికొన్ని చోట్ల మార్పులు చేయమని అన్నారట. ఈ మేరకు దర్శకుడు సీన్స్ రాసి ,రీషూట్ పెట్టుకుని మార్పులు , చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.
 
ఇక ఈ చిత్రం కథ ...తన మేనల్లుడు చేతిలో తనకు మరణం ఉందని జాతకాలతో  పుట్టినప్పుడే తెలుసుకుని విడిపోయి...మళ్లీ పెద్దయ్యాక కలిసిన మామా-అల్లుడు కథ అని తెలుస్తోంది. జనార్దన మహర్షి చేసిన ఈ కథను కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి డవలప్ చేసారట.  

సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు.