Asianet News TeluguAsianet News Telugu

‘ఎఫ్‌ 3’: రేచీక‌టి పాత్రలో వెంక‌టేష్..?

‘పటాస్‌’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. ‘సరిలేరు..’ తరవాత అనిల్‌ ముందు చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో దేన్ని పట్టాలెక్కించాలో తెలీక సతమతమయ్యాడు. చివరకు ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కిస్తున్నాడు.  

Venkatesh Suffers Night Blindness in F3 jsp
Author
Hyderabad, First Published Mar 17, 2021, 5:30 PM IST

‘పటాస్‌’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. ‘సరిలేరు..’ తరవాత అనిల్‌ ముందు చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో దేన్ని పట్టాలెక్కించాలో తెలీక సతమతమయ్యాడు. చివరకు ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కిస్తున్నాడు.  

 ‘ఎఫ్‌ 2’లో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించారు. ఈసారి మరో హీరో తోడవుతున్నాడు. మూడో  హీరోగా సునీల్ నటిస్తున్నారు. ‘ఎఫ్‌ 3’ సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తైంది. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర బాగా  పేలనుందని సమాచారం.   ఫ‌న్‌..ఫ్ర‌స్టేష‌న్‌..ఫార్చూన్ ట్యాగ్‌లైన్‌తో డ‌బ్బు చుట్టూ తిరిగే కథాంశంతో స్టోరీ ఉండ‌నుండ‌గా..రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా వెంకీ పాత్ర చేస్తున్నారట.

గుర్తుందో లేదో ..వెంకటేష్ కెరీర్ పీక్స్ లో ఉండగా చేసిన  చంటి సినిమాలో బ్రహ్మానందం చేసిన కేరెక్టర్ ని  ఇప్పుడు స్వయంగా వెంకీనే చేస్తున్నాడు. అదే 'రే చీకటి' కేరెక్టర్. వెంకటేష్ ఎఫ్ 3 లో రేచీకటి ఉన్న కేరెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆ కేరెక్టర్ లో ఫన్ మాములుగా ఉండదు. ఎంటర్టైన్మెంట్ కేకపెట్టిస్తాయట. వెంకటేష్ రేచీకటి సన్నివేశాలన్నీ హిలేరియస్ గా వస్తున్నాయని టాక్. 

అనీల్ రావిపూడి మాట్లాడుతూ.... ప్రస్తుతం ‘ఎఫ్‌3’ని తెరకెక్కిస్తున్నా. ‘ఎఫ్2’ను మించి ఇందులో కామెడీ ఉంటుంది. అందులో నటించినవారే దాదాపు ఇందులోనూ ఉంటారు. కచ్చితంగా ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాం. ‘ఎఫ్‌2’లో భార్యల వల్ల సమస్యలు వస్తే, ‘ఎఫ్ 3’లో డబ్బుతో వచ్చే ఇబ్బందులను చాలా సరదాగా చూపిస్తాం అన్నారు.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌-వరుణ్‌ కలయికలో గతంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందుతుందీ ‘ఎఫ్‌ 3’. ఎఫ్‌ 2 మంచి విజయం అందుకోవడంతో ఎఫ్‌ 3పై అంచనాలు పెరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios