వెంకటేష్‌ హీరోగా నటించిన `నారప్ప` చిత్రాన్ని వాయిదా వేశారు. కరోనా విజృంభన మరింతగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

కరోనా దెబ్బకి చిత్ర పరిశ్రమ విలవిలలాడుతున్నది. ఓ వైపు స్టార్స్ కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు షూటింగ్‌లన్నీ క్రమంగా ఆగిపోతున్నాయి. దీనికితోడు థియేటర్లు స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాదు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి `ఆచార`, నాని `టక్‌ జగదీష్‌`, రానా, సాయిపల్లవి `విరాటపర్వం`, నాగచైతన్య `లవ్‌ స్టోరి` చిత్రాలు వాయిదా పడ్డాయి. వీరి బాటలోనే విక్టర్‌ వెంకటేష్‌ కూడా ఉన్నారు. 

వెంకటేష్‌ హీరోగా నటించిన `నారప్ప` చిత్రాన్ని వాయిదా వేశారు. కరోనా విజృంభన మరింతగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్‌ చేస్తున్నట్టు వెంకటేష్‌ తెలిపారు. `నారప్ప` సినిమా కోసం ఎంతగానో ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు, అందరికి మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకుని చిత్రం విడుదల వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమాని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మహమ్మారి వీలైనంత త్వరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ చిత్రానికి ఇష్టంతోనూ, అంకిత భావంతోనూ పనిచేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటిద్దాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసి కట్టుగానే ఎదుర్కొందాం` అని తెలిపారు. 

`అందరం మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటూ `నారప్ప` టీమ్‌` అని తెలిపింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌`కిది రీమేక్‌. తెలుగులో దీన్ని సురేష్‌ ప్రొడక్షన్‌, వీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తుంది. 

Scroll to load tweet…

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona