Asianet News TeluguAsianet News Telugu

#Saindhav:'సైంధవ్' OTT రిలీజ్ డేట్

హిట్ ఫ్రాంచైజీలతో అందరినీ మెప్పిస్తున్న శైలేష్‌ కొలను ఇప్పుడు వెంకీమామతో సైంధవ్ అంటూ వచ్చాడు.  

Venkatesh #Saindhav movie OTT Release Date? JSP
Author
First Published Jan 17, 2024, 9:10 AM IST


వెంకటేష్ 75వ సినిమాగా ‘సైంధవ్’ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి సంక్రాంతి సినిమాల బరిలోకి దింపారు. అదే సంక్రాంతి  బరిలోకి దిగిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’కు నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ వైజ్ డ్రాప్ కాకుండా మహేష్ ఇమేజ్ అడ్డుపడింది. అయితే సైంధవ్ కు అలాంటి మేజిక్ జరగటం లేదు.  మరో పక్క ‘హనుమాన్’ ఎలా దూసుకెళ్తోందో చూస్తున్నదే. ఈ టాక్ వచ్చిన క్రమంలో   సినిమా ‘సైంధవ్’ని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్లు చాలా మంది డ్రాప్ అయ్యారు.  వాళ్ళంతా యాజ్ యూజువల్ గా ఓటిటిలో చూడాలనుకున్నారు.   ‘సైంధవ్’ఓటిటిలో ఎప్పుడు వస్తుందనేది వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతన్న సమాచారం మేరకు సైంధవ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు మంచి రేటుకే అమ్మారు. Amazon Prime Video వారు ఎక్సక్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నారు.  ETV వాళ్లు శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. సినిమా థియేటర్ లో వర్కవుట్ కాకపోయినా ఓటిటిలో భారీగా నడుస్తుందని భావిస్తోంది అమేజాన్ ప్రైమ్.  సినిమా రిజల్ట్ గొప్పగా లేదు కాబట్టి రిలీజైన నెలలోగా అంటే పిభ్రవరి 15 వ తేదీ నాటికి ఓటిటిలో స్ట్రీమింగ్ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. 
 
సంక్రాంతి సినిమాల పోటితో  ఓపెనింగ్స్ పరంగా ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన బాగా తగిలింది ఈ సినిమాకు .  దాంతో అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోలేక పోయింది  ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 25 కోట్లు అంటే ఈ సినిమా కు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే... సుమారు రూ. 26 లేదా 27 కోట్లు కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. 'సైంధవ్'ను కొన్ని ఏరియాలలో వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.   

వెంకటేష్ చేసిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు యాక్షన్ చిత్రాలు కాగా.. ఎఫ్‌ 3, ఓరి దేవుడా ఫన్ ఓరియెంటెడ్ చిత్రాలు. అన్ని సినిమాలు వెంకీమామకు హిట్టుగానే నిలిచాయి. వెంకీ మామ క్లాస్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. అలాంటి వెంకటేష్ శైలేష్ కొలనుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. హిట్ ఫ్రాంచైజీలతో అందరినీ మెప్పిస్తున్న శైలేష్‌ కొలను ఇప్పుడు వెంకీమామతో సైంధవ్ అంటూ వచ్చాడు.  

'సైంధవ్' సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వెంకీ భార్యగా, ఓ పాపకు తల్లిగా మనోజ్ఞ క్యారెక్టర్ చేశారామె. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించినట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తెలుగు చిత్రమిది. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ డాక్టర్ రోల్ చేశారు. ఆమె పాటు ఆండ్రియా జెరెమియా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios