Asianet News TeluguAsianet News Telugu

#Saindhav: ప్రీ రిలీజ్‌ బిజినెస్ (ఏరియావైజ్), బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

హై యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా రాబోతోన్నట్టుగా అనిపిస్తోంది. విక్రమ్‌లో కమల్ హాసన్ స్టైల్లో వెంకీమామ అదరగొట్టేట్టు కనిపిస్తోంది.  

Venkatesh Saindhav movie distribution rights in Telugu States JSP
Author
First Published Jan 10, 2024, 1:43 PM IST


విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 13న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మొన్న ఆదివారం ఘనంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు సినిమా టీమ్. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఇప్పటికే రిలీజైన  ట్రైలర్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచింది. ఈ నేపధ్యంలో  'సైంధవ్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్? ఎంత అనేది చూస్తే... 

నైజాం (తెలంగాణ) - రూ. 7 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) - రూ. 3 కోట్లు
ఆంధ్ర (అన్ని ఏరియాలు కలిపి) - రూ. 9 కోట్లు
ఏపీ, టీజీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో - రూ. 19 కోట్లు
కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు
ఓవర్సీస్ - రూ.  4 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 25 కోట్లు
 
అంటే ఈ సినిమా కు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే... సుమారు రూ. 26 లేదా 27 కోట్లు కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. 'సైంధవ్'ను కొన్ని ఏరియాలలో వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.  ట్రైలర్ చూస్తూంటే హై యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా రాబోతోన్నట్టుగా అనిపిస్తోంది. విక్రమ్‌లో కమల్ హాసన్ స్టైల్లో వెంకీమామ అదరగొట్టేట్టు కనిపిస్తోంది.  

వెంకటేష్ చేసిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు యాక్షన్ చిత్రాలు కాగా.. ఎఫ్‌ 3, ఓరి దేవుడా ఫన్ ఓరియెంటెడ్ చిత్రాలు. అన్ని సినిమాలు వెంకీమామకు హిట్టుగానే నిలిచాయి. వెంకీ మామ క్లాస్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. అలాంటి వెంకటేష్ శైలేష్ కొలనుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. హిట్ ఫ్రాంచైజీలతో అందరినీ మెప్పిస్తున్న శైలేష్‌ కొలను ఇప్పుడు వెంకీమామతో సైంధవ్ అంటూ రాబోతోన్నాడు. ఇది పాన్ ఇండియన్ రేంజ్‌లో రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా అటు వెంకటేష్‌కు ఇటు శైలేష్ కొలనుకు కలిసి వస్తుందా? అన్నది చూడాలి.

'సైంధవ్' సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వెంకీ భార్యగా, ఓ పాపకు తల్లిగా మనోజ్ఞ క్యారెక్టర్ చేశారామె. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించినట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తెలుగు చిత్రమిది. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ డాక్టర్ రోల్ చేశారు. ఆమె పాటు ఆండ్రియా జెరెమియా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios