వెంకటేష్ ప్రస్తుతం యాక్షన్ మూవీ `సైంధవ్` చేస్తున్నారు. శైలేష్ కొలను రూపొందిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త రచ్చ చేస్తుంది. ఇది `విక్రమ్` నుంచి ఇన్‌స్పైర్ అయి తీస్తున్నారని టాక్.
విక్టరీ వెంకటేష్.. రీమేక్ చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు. అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగానూ నిలిచారు. ఆయన చివరగా `ఎఫ్3` చిత్రంతో అలరించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. దిగజారిన కామెడీ అనే విమర్శలు ఎదుర్కొంది. మరోవైపు ఇటీవల వెంకీ నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు` అత్యధిక వ్యూస్‌ని రాబట్టుకుంది. కానీ బూతు సిరీస్ అంటూ ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకీ ఓ పవర్‌ఫుల్ కథతో వస్తున్నాయి. రా అండ్ రస్టిక్ స్టయిల్‌లో యాక్షన్ మూవీ `సైంధవ్` చేస్తున్నారు. `హిట్` చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు.
సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబర్ రిలీజ్ టార్గెట్‌తో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే విడుదలైన ప్రీ టీజర్, గ్లింప్స్ వీడియోలు విశేష ఆదరణ పొందాయి. అదే సమయంలో కొంత `విక్రమ్` మూవీ స్టయిల్ కనిపించిందనే టాక్ కూడా వినిపించింది. కమల్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన `విక్రమ్` సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఓ ట్రెండ్ సెట్టర్ గానూ నిలిచింది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఈ సినిమాని ఇన్‌స్పైర్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అందులోని కొన్ని సన్నివేశాలో, లేక యాక్షన్ ఎపిసోడ్లని ఫాలో అవుతున్నారు మేకర్స్. అంతేకాదు స్క్రీన్‌ప్లేనూ ఫాలో అవుతుండటం విశేషం.
ఈ నేపథ్యంలో వెంకీ నటిస్తున్న `సైంధవ్` కూడా అలానే ఉండబోతుందట. ఇంకా చెప్పాలంటే `విక్రమ్`కి కాపీ వెర్షన్‌లా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. వెంకటేష్ సలహాతో ఆ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయిన `సైంధవ్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట శైలేష్ కొలను. `సైంధవ్` సినిమా కోస్టల్(పోర్ట్) ఏరియాలో సాగుతుంది. ఇందులో ఓ లక్ష్యం కోసం హీరో పోరాడుతుంటాడని, అందుకోసం ఇతర ముఖ్య పాత్రలు సహాయం చేస్తుంటాయని, `విక్రమ్`లోని కమల్ పాత్రకి దగ్గరగా ఇందులో వెంకీ పాత్ర ఉంటుందట. వెంకటేష్ సైతం ఆ స్టయిల్ లోనే తీయమని శైలేష్‌కి చెప్పినట్టు సమాచారం.
`విక్రమ్`లో ఇన్వెస్టిగేషన్ చేసే ఫహద్ ఫాజిల్ పాత్ర స్టయిల్‌లో `సైంధవ్`లో ఆర్య పాత్ర ఉంటుందని సమాచారం. తమిళ నటుడు ఆర్య ఇందులో పోలీస్‌గా కనిపిస్తాడని, ఆయన పాత్ర ఫహద్ ఫాజిల్ పాత్ర స్టయిల్‌లో సాగుతుందని సమాచారం. మరోవైపు ఇందులో ఆండ్రియా కీలక పాత్రలో కనిపించనుందని, ఆమె పాత్ర `విక్రమ్`లోని ఏజెంట్ టీనా పాత్రకి దగ్గరగా ఉంటుందని సమాచారం. నవాజుద్దీన్ సిద్ధిఖీ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఆయనది `విక్రమ్`లోని విజయ్ సేతుపతి పాత్రకి దగ్గరగా ఉంటుందని టాక్. వీరితోపాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కాస్త గ్లామర్ డోస్ గట్టిగానే ఉంటుందని టాక్.
అయితే కేవలం పాత్రల తీరుతెన్నులు, వాటి స్టయిల్, సాగే విధానం మాత్రం `విక్రమ్` స్టయిల్‌లో ఉంటుందని, కానీ కథగా చూస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. `విక్రమ్` సక్సెస్‌ఫుల్ ఫార్ములా కావడంతో, వెంకీకి కమల్ అంటే ఇష్టం కావడంతో ఆ ఫ్లేవర్‌ని తీసుకున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
