వెంకి ‘సైంధవ్’నేపధ్యం ఇదేనా..?
క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యాయి.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ రీసెంట్ గా ఘనంగా ప్రారంభోత్సవవం జరుపుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రను పోషిస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం .. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించగా, ఈ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలకు కొనసాగింపుగా హిట్-3 మూవీని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
ఈ సినిమా కంటే ముందే, మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సైంధవ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు శైలేష్ కొలను అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను వెంకీ కెరీర్‌లోనే స్టైలిష్ మూవీగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ గురించి నేపధ్యం విషయానికి ...ఈ సినిమా కథ మెడికల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని సమాచారం. థ్రిల్లింగ్ గా సాగుతూనే యాక్షన్ ఎపిసోడ్స్ తో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. గతంలోనూ వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన గణేష్ చిత్రం మెడికల్ మాఫియా నేపధ్యంలో తెరకెక్కిందనే విషయం తెలిసిందే.
‘వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. వెంకటేష్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. . పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.