విక్టరీ వెంకటేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ లో వెంకటేష్-రానా కీలకపాత్రలు పోషించారు.
రానా (Rana), వెంకటేశ్ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu)రిలీజైనప్పుడు ఎన్ని విమర్శలు వచ్చాయో, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మొదటి ఎపిసోడ్ ప్రారంభమైన 5 నిమిషాలకే బూతు పురాణం మొదలైపోతోందని గొగ్గోలు ఎత్తిపోయారు. ఈ సిరీస్‌లో చూపించే సన్నివేశాలు, మాట్లాడే భాష అత్యంత ఘోరంగా ఉన్నాయని అని రివ్యూలు వచ్చాయి .ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడొద్దని హెచ్చరించారు. అయితే అదే ప్లస్ అయ్యినట్లుంది.నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ సిరీస్ వివాదాల్లో నిలిచినప్పటికీ.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సిరీస్ ఓ అరుదైన రికార్డ్ సాధించింది.
2023 జనవరి నుంచి జూన్ వరకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వాటి వివరాలను నెట్‌ఫ్లిక్స్ ల్లడించింది. ఇందులో ‘రానా నాయుడు’ చోటు దక్కించుకుంది. అంతేకాదు ఇండియా నుంచి ఈ ఒక్క సిరీస్ మాత్రమే ఉండడం విశేషం. వ్యూస్ ఆధారంగా సుమారు 18వేల టైటిల్స్ డేటాను పరిశీలించి, గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్ 400ను విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ టాప్ 336లో నిలిచింది. భారత్ నుంచి ఈ సిరీస్ మాత్రమే టాప్ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ తెలిపింది. రానా నాయుడు వెబ్ సిరీస్ కు 1.64 కోట్ల వ్యూయింగ్ హవర్స్ నమోదయ్యాయి.
ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్ పేరుతో ఈ డేటాను వెల్లడించింది. ఈ లిస్ట్ లో అమెరికన్ షో ది నైట్ ఏజెంట్ టాప్ లో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఇప్పటి వరకూ ఏకంగా 81.21 కోట్ల గంటల వ్యూయింగ్ నమోదు కావడం గమనార్హం. తర్వాతి స్థానంలో గిన్నీ అండ్ జార్జియా సీజన్ 2 66.51 కోట్ల గంటలతో ఉంది. టాప్ 10లో ది గ్లోరీ సీజన్ 1, వెన్స్‌డే సీజన్ 1, క్వీన్ చార్లెట్: ఎ బ్రిడ్జెర్టన్ స్టోరీ, యు సీజన్ 4, ఔటర్ బ్యాంక్స్ సీజన్ 3, మ్యానిఫెస్ట్ సీజన్ 4లాంటివి ఉన్నాయి.
ఇక అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్‌గా ఈ సిరీస్ రూపొందింది. దీని కోసం రానా, వెంకటేశ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. తాజాగా దీనికి సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది.
