Venkatesh , Rana తండ్రీ కొడుకులుగా బాబాయి.. అబ్బాయి..? టాలీవుడ్ లో మరో మలయాళ రీమేక్

టాలీవుడ్ లో రీమేక్ సీనిమాల రారాజు ఎవరు అంటే వెంటనే విక్టరీ వెంకటేష్ (Vekatesh) గుర్తుకు వస్తారు. రీమేక్  సినిమాలతో సూపర్ సక్సెస్ కొట్టిన.. టాలీవుడ్ హీరో.. ఈసారి అబ్బాయి రానా (Rana) తో కలిసి బయలుదేరాడు.

Venkatesh ,Rana Movie

టాలీవుడ్ లో రీమేక్ సీనిమాల రారాజు ఎవరు అంటే వెంటనే విక్టరీ వెంకటేష్ (Vekatesh) గుర్తుకు వస్తారు. రీమేక్  సినిమాలతో సూపర్ సక్సెస్ కొట్టిన.. టాలీవుడ్ హీరో.. ఈసారి అబ్బాయి రానా (Rana) తో కలిసి బయలుదేరాడు.

టలీవుడ్ లో ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ రీమేక్ లు.. డబ్బింగ్ సినిమాల హవా నడిచేది. ఇప్పటికీ తమిళ స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలు ఇక్కడ సూపర్ సక్సస్ అవుతుంటాయి. అయితే ఈమధ్య టాలీవుడ్ కు మలయాళ మోజు పెరిగింది. ఎక్కువగా మలయాళ సినిమాల కథలను తీసుకుని. మనదగ్గర రీమేక్ చేస్తున్నారు. ఈ మ్యానియా దృశ్యం సినిమా అప్పటి నుంచి బాగా పెరిగింది. ఇక ఈమధ్య వరుసగా తెలుగు వెండితెరపై మలయాళ కథలు  వెలుగు వెలుగుతున్నాయి.

 టాలీవుడ్ లో మలయాళ రీమేక్ సినిమాల సందడి పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళ సినిమాల్లో కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి .. పాత్రలు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తాయి. అందుకే టాలీవుడ్ మలయాళ సినిమాల వైపు ఎక్కువగా చూస్తుంది. ముఖ్యంగా ఆహా లాంటి తెలుగు ఓటీటీ(ott) ప్లాట్ ఫామ్స్ మలయాళ సినిమాలు తీసుకుని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. ఆడియన్స్ లో కూడా మలయాళ సి నిమాలకు మంచి డిమాండ్ ఉంది.
ఇక మన రీమేక్ రారాజు విక్టరీ వెంకటేష్ (Vekatesh)  మరో మలయాళ సినిమా రీమేక్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న బ్రో డాడీ  సినిమా సురేశ్ బాబుకి నచ్చిందట. దాంతో ఈ సినిమాను ఆయన తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అటు వెంకటేష్ (Vekatesh) కి కూడా ఈ సినిమా బాగా నచచడంతో రీమేక్ ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమాను వెంకటేశ్ – రానా కాంబోలో చేస్తే  బాగుంటుంది అనుకుంటున్నారట. దీనికి అంతా రెడీ అవుతున్నట్టు టాక్.  మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ - పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు.మోహన్ లాల్ సరసన మీనా,పృథ్వీరాజ్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించారు. వెంకటేష్(Venkatesh) కు ఫన్ అండ్ కామెడీ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఈ మలయాళ సినిమా కూడా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుందట. అలా ఈ సినిమా రీమేక్ తో వెంకటేశ్ – రానా(Venkatesh-Rana) తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios