సరికొత్త అవతారం ఎత్తాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ స్టార్ వెంకటేష్. గుర్తు పట్టలేని విధంగా ఆయన గెటప్ ఉంది. రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు స్టార్ హీరో.. ఈ సిరీస్ నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు టీమ్. 

సరికొత్త అవతారం ఎత్తాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ స్టార్ వెంకటేష్. గుర్తు పట్టలేని విధంగా ఆయన గెటప్ ఉంది. రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు స్టార్ హీరో.. ఈ సిరీస్ నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు టీమ్. 

 దగ్గుబాటి హీరోలు.. బాబాయి.. అబ్బాయి.. విక్టరీ వెంకటేష్‌‌ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొట్ట మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవ‌న్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌కు క‌ర‌న్ హ‌న్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక దగ్గుబాటి స్టార్స్... బాబాయి, అబ్బాయిలు క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌నుండటంతో ఆడియన్స్ లో కూడా అంచనాలు పెరిగిపోయాయి ఈ వెబ్ సిరీస్ పై. ఇక ఎప్పుడెప్పుడు ఈ వెబ్ మూవీ రిలీజ్ అవుతుందా అని ఇంట్రెస్ట్ గా ఎదరుచూస్తున్నారు ఆడియన్స్. 

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో రానా, వెంకటేష్‌ స్పెషల్ లుక్ పోస్టర్‌లు వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి.రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా అంచనాలు *పెంచే క్రమంలో... ఈ వెబ్‌సిరీస్‌ నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

YouTube video player

టీజర్ స్టార్ట్ అవ్వడమే.. రానా డైలాగ్‌తో స్టార్ట్ అయ్యింది. సాయం కావాలా అంటూ రానా అడగటంతో మొదలైన టీజర్‌.. ఉత్కంట భరితంగా సాగిందనే చెప్పాలి. సెలబ్రిటీల ప్రాబ్లమ్స్ ను తీర్చే పాత్రలో రానా నటించగా.. ఈ పాత్రకు కాస్త నెగెటీవ్ శేడ్స్ అద్దినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సి న పాత్ర వెంకటేష్‌ ది. ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సినిమాలో. చింపిరి జుంపాల జుట్టుతో... మునుపెన్నడూ లేని విధంగా వెంకటేష్ కనిపించాడు. 

జైల్లో శిక్ష అనుభవించి వెంకటేష్ బయటకు వస్తున్నట్టుగా టీజర్ లో చూపించారు. ఈ సారి వెంకీ కాస్త వయసు మళ్ళిన పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఇక విక్టరీ అభిమానులను వెంకటేష్‌ లుక్‌ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్‌, రానా దగ్గుబాటి తండ్రి, కొడుకులుగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. టీజర్‌తోనే మేకర్స్‌ వెబ్‌సిరీస్‌పై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.