Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్‌ఎంసీ ఓటింగ్‌కి వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రాజమౌళి దూరం?

సెలబ్రిటీలు, తారలు సామాజిక బాధ్యత కలిగిన ఓటింగ్‌లో పాల్గొనకపోతే.. అది నిజంగా విచారకరమనే చెప్పాలి. తాజాగా మంగళవారం జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో పలువురు అగ్ర తారలు ఓట్ వేసే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. వారు ఓటింగ్‌కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. 

venkatesh ntr allu arjun ram charan and rajamouli not intrest for voting ? arj
Author
Hyderabad, First Published Dec 1, 2020, 9:39 AM IST

సినీ తారలను ఫాలో అయ్యే అభిమానులు లక్షల్లో ఉంటారు. వారిని చూసి ఇన్‌స్పైర్‌ అవుతుంటారు. వారు చెప్పే విషయాలను ఫాలో అవుతుంటారు. అలాంటి సెలబ్రిటీలు, తారలు సామాజిక బాధ్యత కలిగిన ఓటింగ్‌లో పాల్గొనకపోతే.. అది నిజంగా విచారకరమనే చెప్పాలి. తాజాగా మంగళవారం జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో పలువురు అగ్ర తారలు ఓట్ వేసే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. వారు ఓటింగ్‌కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. 

వాటిలో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ ప్రధానంగా ఉంది. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం పూణేలో జరుగుతుంది. దీంతో హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి కూడా అక్కడే ఉన్నారు. షూటింగ్‌ బిజీ షెడ్యూల్‌ రీత్యా వారు వచ్చి పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. వీరే కాదు, అల్లు అర్జున్‌ కూడా ఓటింగ్‌కి దూరంగా ఉండబోతున్నారనిపిస్తుంది. ఆయన `పుష్ప` చిత్ర షూటింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. వీరితోపాటు సీనియర్‌ హీరో వెంకటేష్‌ కూడా హైదరాబాద్‌లో లేనట్టు
సమాచారం. మరి వీరి వచ్చి ఓట్‌ వేసి తమ బాధ్యతని చాటుకుని, అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తారా? లేక తమ షూటింగ్‌ బిజీలో ఓట్‌కి దూరంగా ఉంటారా? అన్నది సస్పెన్స్ నెలకొంది. దీనిపై సాయంత్రానికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

ఇదిలా ఉంటే ఇప్పటికే సెలబ్రిటీల్లో మొదటగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా జుబ్లీహిల్స్ క్లబ్‌లో ఓట్‌ వేశారు. వీరితోపాటు నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, ఆయన సతీమణి ఫిల్మ్ నగర్ క్లబ్‌లో ఓట్‌ వేశారు. మరో నిర్మాత ఉషా ముల్పూరి సైతం తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios