వెంకటేష్ నెక్ట్స్ సినిమా కన్ఫమ్?.. ఈ సారి హై ఓల్టేజ్ యాక్షన్ మూవీతో.. దర్శకుడెవరంటే?
విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమాకి సంబందించిన ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా ఆయన ఓ హిట్ డైరెక్టర్ కి కమిట్ అయ్యారట. యాక్షన్ మూవీ చేయబోతున్నారని టాక్.

విక్టరీ వెంకటేష్ ఇటీవల `ఎఫ్3`తో కామెడీని పండించారు. అంతకు ముందు `నారప్ప` వంటి యాక్షన్ మూవీ, `దృశ్యం 2` వంటి ఫ్యామిలీ థ్రిల్లర్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు అబ్బాయి రానాతో కలిసి వెబ్ సిరీస్ `రానా నాయుడు` చేస్తున్నాడు. ఇది ఓటీటీలో విడుదల కాబోతుంది. కొత్త సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే తాజాగా ఓ స్ట్రెయిట్ మూవీ కి కమిట్ అయ్యాడట వెంకీ. రీమేక్ కి కేరాఫ్‌గా నిలిచిన వెంకీ ఈ సారి ఒరిజినల్ స్టోరీతో రాబోతున్నారు.
ఇటీవల `హిట్2`తో విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను దర్శకుడితో సినిమా చేయబోతున్నారట వెంకటేష్. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని సమాచారం. బోయనపల్లి వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమా కమల్ హాసన్ నటించిన `విక్రమ్` తరహాలో కథ సాగుతుందని, ఫుల్ యాక్షన్ మూవీ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉందని, ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నారట.
ఇదిలా ఉంటే వెంకీ నటించబోతున్న 75వ చిత్రం ఇది కావడం విశేషం. వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారట. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం వెంకటేష్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన `నారప్ప` చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఛారిటీ కోసం దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయగా, మిశ్రమ స్పందన లభించినట్టు టాక్. శైలేష్ కొలను ఇటీవల `హిట్2`తో మంచి విజయాన్ని అందుకున్నారు. దీన్ని ఒక ఫ్రాంఛైజీగా తీసుకురాబోతున్నారు. నెక్ట్స్ నానితో `హిట్3` చేయబోతున్నారు.