ఈమధ్య బాలీవుడ్,టాలీవుడ్ అన్న ఎల్లలు చెదిరిపోయి.. సినిమా ఇండస్ట్రీ అంతా ఇండియన్ సినిమాగా ప్రొజెక్ట్ అవుతుంది. అది కూడా సౌత్ సినిమా వల్ల. ఇక ఈ మధ్యలో కొన్ని కాంబినేషన్లు కూడా సెట్ అవుతన్నాయి. ఆమధ్య చిరంజీవి సినిమాలో సల్మాన ఖాన్ నటించగా.. ఇప్పుడు సల్మాన్ సినిమాలో వెంకటేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్ కు బాలీవుడ్ లో బీజం పడబోతోంది. టాలవుడ్ సీనియర్ హో వెంకటేష్.. బాలీవుడ్ సీనియర్ మీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుంతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు మరోవైపు ఫర్హద్ సామ్‌జీ డైరెక్షన్‌లో కభి ఈద్ కభి దివాళి సినిమా చేస్తున్నాడు. సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అప్ డేట్ కూడా ఇచ్చారు టీమ. ఇక ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ వార్త ఇపుడు టాలీవుడ్ సర్కిల్ లో తెగ తిరుగుతోంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఆ న్యూస్ ఏంటీ అంటే..తెలుగు హీరో విక్టరీ వెంకటేశ్ ఈహిందీ మూవీలో కనిపించబోతున్నాడన్న క్రేజీ న్యూస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
విక్టరీ వెంకటేష్ ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. సల్మాన్, వెంకటేశ్ మంచి ఫ్రెండ్స్ కావడంతో ఈ మూవీకి ఫిక్స్ అయిన్టు సమాచారం. ఇక ముంబైకి సమీపంలోని కర్జాత్ లో వేసిన స్పెషల్‌సెట్స్ లో మే 11 నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోందట. 90 రోజుల షెడ్యూల్‌లో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట టీమ్. సల్మాన్, వెంకీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే..రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.