విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్2 చిత్రంతో భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. అభిమానులు తన నుంచి కోరుకుంటున్న ఎంటర్టైన్మెంట్ ని వెంకీ ఈ చిత్రం ద్వారా అందించాడు. ఇకపై వెంకీ హాస్య భరిత చిత్రాలనే ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. వెంకీ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం వెంకీ మామ. 

నాగ చైతన్య, వెంకీ కలసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో వెంకీ, నాగ చైతన్య మామ అల్లుళ్లుగా నటిస్తున్నారు. వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్యకు హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్నారు. 

ఇటీవల వెంకీ, పాయల్ రాజ్ పుత్ పై ఓ సాంగ్ షూట్ చేస్తున్న సందర్భంగా వెంకీ డాన్స్ చేస్తూ గాయపడ్డాడు. కాలు తీవ్రంగా బెణకడంతో వైద్యులు వెంకీకి రెండు వారాల పాటు విశ్రాంతి సూచించినట్లు తెలుస్తోంది. వెంకీ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.