సినిమా ఫుల్ ఫన్ తో సాగే పక్కా ఫ్యామిలీ డ్రామా కావటం కలిసొచ్చింది. పైగా ‘విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్’ కలిసి నటించిన చిత్రం.
వెంకీ,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. గ్రాస్ విషయానికి వస్తే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండించింది. అందుకే, ‘ఎఫ్ 3’ అంటూ సీక్వెల్ ను చాలా భారీగా ప్లాన్ చేసి వదిలారు. ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అదనపు షోల కోసం బయ్యర్లు పోటీ పడ్డారు. యూఎస్ లోనూ 350 పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడ్జాయి. ప్రైమ్ మీడియా యూఎస్ వాళ్లు అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ హక్కుల తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తానికి వాళ్ళు ఈ సినిమాని కొన్నారు. ఈ నేపధ్యంలో యుఎస్ లో ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్దితి ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘ఎఫ్3’ అద్భుతంగా మొదలైంది. ఈ చిత్రం మొదటి రోజు (ప్రీమియర్ షోలతో కలిపి) హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. $500k పైగానే కలెక్ట్ చేసిందని అక్కడ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం (1వ రోజు) భారీ వసూళ్లు సాధించింది. ట్రెండ్ ఉషారుగా ఉంది.
'F3' USAలో మెమోరియల్ డే వీకెండ్ ప్లస్ కానుంది. సోమవారం కూడా సెలవు దినం కావడంతో నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు రాబడుతోంది. ‘ఎఫ్2’చిత్రం లైఫ్ టైమ్ లో $2 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని బట్టి చూస్తూంటే...లాంగ్ రన్ లో ‘ఎఫ్3’ఎంత సంపాదిస్తుందనే లెక్కలు మొదలెయ్యాయి.
సినిమా ఫుల్ ఫన్ తో సాగే పక్కా ఫ్యామిలీ డ్రామా కావటం కలిసొచ్చింది. పైగా ‘విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్’ కలిసి నటించిన చిత్రం. అనిల్ రావిపూడికి, నిర్మాత దిల్ రాజుకు బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టారంటున్నారు.
ఈ సినిమాలోని ఓ స్పెషల్ రోల్ లో సోనాలి చౌహాన్ నటించింది. అలాగే, ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించాడు. మొత్తానికి నవ్వుల హరివిల్లును ఈ చిత్రం చూపించింది. అయితే మరీ పాత కాలం కథ, సీన్స్, లాజిక్ లేని సినిమా అంటూ విమర్శలు ఉన్నాయి. వాటిని దాటుకుని ఈ సినిమా ఏ స్దాయిలో ముందుకు వెళ్తుందో చూడాలి.
