వెంకటేష్‌ నటించిన `దృశ్యం` సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా మలయాళ రీమేక్‌గా రూపొంది విశేషంగా అలరించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా `దృశ్యం2` చిత్రం రూపొందుతుంది. వెంకటేష్‌ హీరోగా, మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాతృక దర్శకుడు జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి మొదటి వారంలో సినిమా ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల్లోనే తన పార్ట్షూటింగ్‌ని కంప్లీట్‌ చేశాడు హీరో వెంకీ. గురువారం తన పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. 

సినిమా మొత్తం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని, త్వరలోనే అది కూడా పూర్తవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. దీన్ని సురేష్‌ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `దృశ్యం2`కిది రీమేక్‌. మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా  జంటగా నటించారు. అది సూపర్‌ హిట్‌ కావడంతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకీ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రాబోతుంది. తమిళ `అసురన్‌` రీమేక్‌ `నారప్ప` మే 14న విడుదల కానుంది. ఆ తర్వాత `దృశ్యం2` రిలీజ్‌ కానుంది. ఆగస్ట్ లో `ఎఫ్‌3`ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.