Asianet News TeluguAsianet News Telugu

వెంకటేష్‌-అనిల్‌ రావిపూడి సినిమా కథ ఇదే.. చిరంజీవికి చెప్పిన స్క్రిప్టేనా?

`ఎఫ్‌2`, `ఎఫ్‌3` ల తర్వాత వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. తాజాగా ఈ కాంబినేషన్‌ మరోసారి సెట్‌ అయ్యింది. దీని స్టోరీ వివరాలు లీక్‌ అయ్యాయి. 

venkatesh anil ravipudi movie story details is it the script given to Chiranjeevi?
Author
First Published Feb 3, 2024, 7:52 AM IST | Last Updated Feb 3, 2024, 7:53 AM IST

వెంకటేష్‌ ఇటీవల `సైంధవ్‌` చిత్రంతో వచ్చాడు. సంక్రాంతి సందర్బంగా ఆయన మూవీ విడుదలైంది. పూర్తిగా నిరాశ పరిచింది. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ గా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా యాక్షన్‌ సినిమాతో రావడమే వెంకీ చేసిన మిస్టేక్‌. తనదైన ఫ్యామిలీ ఎలిమెంట్లతో సినిమా చేసి ఉంటే ఆయన కచ్చితంగా హిట్ కొట్టేవాడు. దీంతో ఇప్పుడు వరుసగా మరో ఫ్లాప్‌ వెంకీ జాబితాలో చేరిపోయింది. 

ఇక ఇప్పుడు వెంకీ ఎవరితో చేస్తారనే వార్తలు ప్రారంభమయ్యాయి. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందనే ప్రచారం గట్టిగా జరిగింది. నాని, వెంకీలతో మాటల మాంత్రికుడు సినిమా ప్లాన్‌ చేశారని అన్నారు. కానీ అది ఇంకా సెట్‌ కాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనిల్‌ రావిపూడితో సినిమా ఓకే చేశారట. గతంలో వీరి కాంబినేషన్‌లో `ఎఫ్‌ 2`, `ఎఫ్‌ 3` చిత్రాలు వచ్చాయి. కామెడీ ఎంటర్‌టైనర్లుగా వచ్చి ఫర్వాలేదనిపించాయి. దీంతో తనకు అనిల్‌ రావిపూడి బెటర్‌ అని భావించిన వెంకీ ఓకే చేశారట. 

అయితే ఈ స్క్రిప్ట్ కి సంబంధించి స్టోరీలో మెయిన్ ఎలిమెంట్‌ లీక్‌ అయ్యింది. ఈ మూవీ పల్లెటూరు బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుంది. అలాగే సిటీ ఎలిమెంట్లు కూడా ఉంటాయట, ఇటు విలేజ్‌, అటు సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో కథని రెడీ చేశాడట అనిల్‌ రావిపూడి. ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఫన్‌, కొంత యాక్షన్‌ మేళవింపుగా ఈ మూవీ ఉండబోతుందట. వెంకటేష్‌ ఇప్పుడు ఇమ్మీడియెట్‌గా ఈ మూవీనే చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూవీని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారని నిర్మాత శిరీష్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు దర్శకుడు అనిల్‌ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. స్టోరీ కూడా వినిపించారు. ఇది ఓకే అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. అనిల్‌ రావిపూడి స్క్రిప్ట్ మెగాస్టార్‌ పక్కన పెట్టారని సమాచారం. ఇతర స్క్రిప్ట్ లు వింటున్నారు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` సినిమా షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. దీనికి చాలా టైమ్‌పడుతుంది. ఆ తర్వాత కొత్త వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

చిరంజీవికి చెప్పిన స్క్రిప్టే వెంకీతో చేస్తున్నారా? అనే సందేహాలు ప్రారంభం అయ్యాయి. కానీ అది వేరు, ఇది వేరని తెలుస్తుంది. చిరుకి చెప్పిన కథని అనిల్ రావిపూడి కూడా పక్కన పెట్టి, కొత్త కథతో వెంకీతో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. చిరుకి చెప్పిన కథలో ఒకరే హీరోయిన్‌ అట. మరి ఇది ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.

Read more: `దమ్‌ మసాలా` పాటకి సితార పాప దుమ్మురేపే డాన్సు.. శ్రీలీల కూడా దిగదుడుపే.. ఇప్పుడే ఇలా ఉంటే ఇక హీరోయిన్ అయితే..

Also read: `చచ్చేంత ప్రేమ` నవల కాపీ వివాదంలో `శ్రీమంతుడు` నిర్మాతలు ఏం చేయబోతున్నారు? ఏం చెబుతున్నారు?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios