‘‘ఎఫ్‌-2’లో భార్యలపై ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న మన హీరోలు ‘ఎఫ్‌-3’లో డబ్బు వల్ల ఫ్రస్ట్రేషన్‌కు గురి కానున్నారు. కో బ్రదర్స్‌ వెంకీ, వరుణ్‌ జీవితాల్లో మరింత ఫన్‌ నింపుదాం’ అని చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ చిత్రం కాన్సెప్టు దేనిచుట్టూ తిరగనుందో చెప్పేసింది. ‘ఎఫ్‌-2’లో నటించిన తమన్నా, మెహరీన్‌.. ఈ సీక్వెల్‌లోనూ సందడి చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ బయిటకు వచ్చింది.  ఈ చిత్రం లో కథ ప్రకారం హీరోలిద్దరూ తమ భార్యలు బాగా ఖర్చు పెట్టేస్తూంటే ఎదురు చెప్పలేక సైలెంట్ గా ప్రస్టేట్ అవుతూంటారు. 

ఈ క్రమంలో తమ సంపాదన తమ భార్యల ఖర్చులకు సరిపోవటం లేదని భావించి..అందుకోసం ఓ ప్లాన్ చేస్తారు. ఓ పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. తోడు అళ్లల్లు ఇద్దరూ దాన్ని రన్ చేస్తూంటారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు..వారి ఫ్యామిలీలను ఎలా డిస్ట్రబ్ చేసాయి. చివరకు వారు ఆ సమస్యల నుంచి ఎలా బయిటపడ్డారు అనేది ఫన్నీగా నడుస్తుంది. ప్రతీ సీన్ ...ఫన్ తో నిండిపోయి అలరిస్తుందని చెప్తున్నారు. రెస్టారెంట్ నడిపేటప్పుడు వచ్చే సమస్యలు కామెడీగా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో. 
  

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ ‘F2’కు సీక్వెల్‌గా ‘F3’ తెరకెక్కిస్తాం.  ‘F3’ సినిమాకు వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘గోల్‌మాల్’ సినిమా సిరీస్‌లా వరుసగా తీయాలని ఉంది. త్వరలో మరో సినిమా తీయబోతున్నా. ఈ సినిమాలో కథకే ప్రాధాన్యం ఉంటుంది. ’’ అని అన్నారు.
 

కాగా ఈ ‘F2’ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలో వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్‌,రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌కాష్ రాజ్‌, ఝాన్నీ, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అన‌సూయ‌, ర‌ఘు బాబు, నాజర్, పృథ్వి, వై.విజ‌య‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు నటించారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌ సంగీతం అందించారు.