వెంకీ వరుణ్ మల్టీస్టారర్.. అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు

Venkatesh and varun tej multi starrer getting ready
Highlights

  • విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వాళ్ళతో కలిసి సినిమాలు వరసబెట్టి క్యులో పెట్టేస్తున్నాడు
  • పటాస్ సుప్రీమ్ రాజా ది గ్రేట్ హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి
    • ఎఫ్2(ఫన్-ఫ్రస్టేషన్)టైటిల్ లోగో అఫీషియల్ గా లాంచ్ చేసారు​

విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వాళ్ళతో కలిసి సినిమాలు వరసబెట్టి క్యులో పెట్టేస్తున్నాడు. పటాస్ సుప్రీమ్ రాజా ది గ్రేట్ హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడితో దిల్ రాజు నిర్మించనున్న ఎఫ్2(ఫన్-ఫ్రస్టేషన్)టైటిల్ లోగో అఫీషియల్ గా లాంచ్ చేసారు. వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటించనున్న ఈ మూవీని హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు టాక్. హీరొయిన్లు - సాంకేతిక వర్గం తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ ఫిదా బ్లాక్ బస్టర్ - తొలి ప్రేమ సూపర్ హిట్ తో మాంచి ఊపుమీదున్నాడు. సున్నితమైన ప్రేమ కథలు ఎంచుకునే వరుణ్ ఈసారి రూట్ మార్చి కామెడీ జానర్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. కథలో మెయిన్ థ్రెడ్ ఏంటనేది బయటికి చెప్పలేదు కాని లోగోను చూస్తుంటే మంచి హంగామా ఉండేలా అనిపిస్తోంది.

గురు తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ అమాంతం స్పీడ్ పెంచేసాడు. తేజ దర్శకత్వంలో నారా రోహిత్ కాంబోలో షూటింగ్ ఇప్పటికే లూప్ లైన్ లో ఉండగా తన మేనల్లుడు నాగ చైతన్య తో బాబీ దర్శకత్వంలో నటించే మూవీ మే నుంచి సెట్స్ కు వెళ్లనుంది. ఈ ఎఫ్2 ఎప్పుడు మొదలవుతుంది రిలీజ్ డేట్ టార్గెట్ ఏంటి అనేది దిల్ రాజు ప్రకటించాల్సి ఉంది. మాస్ ఎలెమెంట్స్ మిస్ చేయకుండా కథలను నడిపించడంలో పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన మూడు సినిమాలను తలదన్నే రేంజ్ లో దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టు టాక్. గోపాలా గోపాలా తర్వాత మెగా హీరోతో జట్టుకట్టడం ఇది రెండో సారి. కాకపోతే అప్పుడు బాబాయ్ తో ఇప్పుడు అబ్బాయ్ తో.

నిర్మాతగా మంచి సక్సెస్ రేట్ మైంటైన్ చేస్తున్న దిల్ రాజుకి ఇది మరో మేజర్ బ్రేక్ అయ్యేలా ఉంది. మల్టీ స్టారర్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది . ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబో ఇప్పటికే సంచలనం రేపగా వెంకటేష్ కూడా కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తూ తన వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్నాడు.  ఎఫ్2 టైటిల్ లో ఫ్రస్ట్రేషన్ అని కూడా పెట్టారు అంటే ఏదో ట్విస్ట్ ఉన్నట్టే అనిపిస్తోంది. సుప్రీమ్ రాజ  ది  గ్రేట్ సినిమాలతో అనిల్ రావిపూడి ప్రతిభను గుర్తించి మూడో సినిమా కోసం లాక్ చేసేసుకున్నాడు దిల్ రాజు. మొత్తానికి ఈ ఏడాది మల్టీ స్టారర్ నామ సంవత్సరంగా కనిపిస్తోంది. 

loader