రవితేజ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం కిక్. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన  కిక్ 2 ఆ స్దాయిలో ఆడలేదు. అయితే రవితేజకు ఆ సినిమాపై మోజు పోలేదు. దాంతో ఇఫ్పుడు మరోసారి అలాంటి కథతో మన ముందుకు రాబోతున్నారట. అందుకోసం వెంకటేష్ ని తోడు తెచ్చుకుంటున్నారని వినికిడి.. వివిరాల్లోకి వెళితే..

రీసెంట్ గా ఎఫ్ 2 తో హిట్ కొట్టిన వెంకటేష్ మంచి జోష్ మీద ఉన్నారు. వరస సినిమాలు కమిటవుతున్నారు. అంతకు ముందు ఆచి, తూచి అడుగులు వెయ్యాలని స్పీడ్ తగ్గించిన  వెంకీ...కథ వినటం ..డేట్స్ ఇచ్చేయటం గా తన విధానంలో మార్పుతెచ్చుకున్నారు. అలా ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లలో మరో మల్టిస్టారర్ కూడా ఉంది. రవితేజతో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి స్క్రీన్ ని నవ్వులతో నింపేయనున్నారని సమాచారం.  

మరి ఈ చిత్రానికి డైరక్ట్ చేసే దర్శకుడు ఎవరూ అంటే...వీరూ పోట్ల అని తెలుస్తోంది. గతంలో బిందాస్, ఈడు గోల్డ్ ఎహే వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన వీరూ పోట్ల ఈ కాంబోలో ఓ కథ చెప్పి ఒప్పించారట. ప్రస్తుతం డిస్కషన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.  ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. రవితేజ, వెంకటేష్ ల మధ్య ఓ దొంగ-పోలీస్ ఆట లాంటి గేమ్ తో నడిచే ఈ చిత్రం రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కిక్ లాంటి సినిమా అవుతుందంటున్నారు. 

ఇక రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా తయారు అవుతున్న ఆ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ సినిమాలో రవితేజ రెండు వేర్వేరు గెటప్స్ లో కనిపించనున్నారు. విభిన్నమైన కాన్సెప్టుతో ఆ సినిమా రూపొందనుంది.