కరోనా, లాక్‌డౌన్‌..డిజిటల్‌ మాధ్యమాలకు ప్రయారిటీ పెంచింది. డిజిటల్‌ కంటెంట్‌కి ప్రాధాన్యత పెరిగింది. స్టార్స్ సైతం డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మరోవైపు తారలు హోస్ట్ లుగా మారిపోతున్నారు. సమంత `సామ్‌జామ్‌` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్‌బాస్‌` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్‌, రానా వంటి వారు రియాలిటీ షోస్‌కి హోస్ట్ గా చేశారు. 

ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ కూడా హోస్ట్ గా మారబోతున్నారు. తన అబ్బాయి రానాతో కలిసి ఓ రియాలిటీ షో చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్‌లో ఓ రియాలిటీ షో చేయడానికి ప్రముఖ టీవీ ఛానెల్‌ ప్లాన్‌ చేసిందట. ఇప్పటికే రానా హోస్ట్ చేసిన `నెంబర్‌ వన్‌ యారీ` షోలో వెంకటేష్‌ కనిపించి సందడి చేశారు. అయితే ఈ సారి వీరిద్దరు కలిసి రియాలిటీ షో చేయబోతున్నారట. గతంలో కంటే భిన్నంగా ఈ షోని డిజైన్‌ చేశారట. సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఫస్ట్ టైమ్‌ వెంకీ చేయబోతున్న ఈ షో ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఓ తమిళ రీమేక్‌లో వీరిద్దరు హీరోలుగా నటిస్తారని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతోపాటు ఇటీవల రానా `సౌత్‌బే` పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించారు. ఇందులో నిర్వహించే లవ్‌ ప్రోగ్రామ్‌కి వెంకీ హాజరయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పాల్గొన్నారు. ఈషోలో తాప్సీ, మంచు లక్ష్మి కూడా పాల్గొనడం విశేషం.