బిగ్ బాస్ 3 కి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. జూన్ లో మొదలుపెట్టాలని స్టార్ మా యాజమాన్యం సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే హోస్టింగ్ విషయంలో గత కొంత కాలంగా అనేక రూమర్లు ఆడియెన్స్ ను కంఫ్యూజన్ కి గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వెంకటేష్ ఈ విషయంలో అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేశాడు. 

మూడవ సీజన్ కు వ్యాఖ్యాతగా వెంకటేష్ రాబోతున్నట్లు టాక్ బాగా వచ్చింది. అయితే ఇటీవల F2 ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అందుకు సంబందించిన ప్రస్తావన రాగా.. అదంతా ఒక రూమర్ అని వెంకీ సింపుల్ గా ఒక ఆన్సర్ ఇచ్చేశాడు. అసలు ఎవరు కూడా వెంకీని కలవలేదని తెలుస్తోంది. ఇక మళ్ళీ ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక రూమర్ వచ్చింది.  

కానీ అవతల RRR పూర్తయ్యే వరకు తారక్ మరో పని పెట్టుకోకూదడదని అనుకుంటున్నాడు. తారక్ ఒప్పుకున్నా జక్కన్న మాత్రం బయటకు వదలడని సమాచారం. మొత్తంగా నాని హోస్టింగ్ తో బిగ్ బాస్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ షెడ్యూల్ సెట్ చేసుకోలేక ఇబ్బంది పడితే నాని విమర్శలను ఎదుర్కోలేక చేతులెత్తేశాడు. దీంతో హీరోలు అటు వైపు వెళ్లేందుకు భయపడుతున్నట్లు టాక్.