250 థియేటర్లలో రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వెంకటాపురం మూవీ సక్సెస్ పై సంతోషం వెలిబుచ్చిన చిత్ర యూనిట్ తమ కష్టానికి తగిన ఫలితం లభించిందన్న దర్శక నిర్మాతలు
రాహుల్ - మహిమ మక్వాన జంటగా తెరకెక్కిన 'వెంకటాపురం' సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ, కొత్తదనంతో కూడిన కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించిందని చెప్పాడు. 250 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం జరిగిందనీ, విడుదలైన ప్రతి చోటు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నాడు.
తాము పడిన కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని పొందుతున్నామని దర్శకుడు వేణు మడికంటి చెప్పాడు. ఈ సినిమాకి ఈ స్థాయి సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నామనీ, అందుకు గాను సక్సెస్ టూర్ ను ప్లాన్ చేస్తున్నామని అన్నాడు.
