చిత్రం పేరు : వెంకటాపురం విడుదల తేది : మే 12, 2017 నటీనటులు : రాహుల్‌, మహిమా మక్వానా, అజయ్‌ఘోష్‌, అజయ్‌ తదితరులు.. సంగీతం : అచ్చు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వేణు మడికంటి నిర్మాతలు: శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌ ఏసియానెట్ రేటింగ్ : 2.5/5
కథ :
భీమిలి బీచ్ దగ్గర గుర్తు తెలియని ఓ యువతీ హత్య చేయబడిందని వెంకటాపురం ఎస్సై(అజయ్) కు సమాచారం అందడం తో, అక్కడికి చేరుకున్న అజయ్ ఆ యువతీ ఎవరా అని ఆరా తీస్తాడు..ఆమె పేరు ఛైత్ర(మహిమా మక్వానా) అని తెలుస్తుంది. ఛైత్ర పూర్తి వివరాలు తెలుసుకున్న అజయ్ కి ఆమె కు ఆనంద్ (రాహుల్ ) అనే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుస్తుంది… అతడే ఈ హత్య చేసి ఉంటాడనే అనుమానంతో అతడిని అరెస్ట్ చేస్తాడు..
జైలు కు వెళ్లిన ఆనంద్.. అక్కడ వేరే ఖైదీతో అసలు అతడు పోలీస్ స్టేషన్ కు ఎందుకు రావాల్సి వచ్చిందో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తాడు. ఈ లోపు ఆనంద్పై హత్యాయత్నం కేసు పెట్టి తొమ్మిది నెలలు జైలు శిక్ష వేయిస్తారు. తొమ్మిది నెలలు తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన ఆనంద్, ఆ రోజు రాత్రే పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులందరిని చంపేస్తాడు.. ఇంతకీ ఆనంద్ పోలీసులని ఎందుకు చంపాల్సి వచ్చింది..? అసలు ఛైత్ర ను నిజంగానే ఆనంద్ చంపేశాడా..? ఎస్సై కి ఆనంద్ కు ఇంతకు ముందే సంబంధం ఉందా..? అనే విషయాలు తెర ఫై చూడాల్సిందే..
నటీనటులు :
ముందుగా రాహుల్ గురించి చెప్పుకోవాలి..హ్యాపీ డేస్ తో మంచి పేరు వచ్చినప్పటికీ , ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం పడలేదు. కానీ ఈ మూవీ లో మాత్రం రాహుల్ మేకోవర్ బాగుంది..సినిమా కు ప్రాణం పోసాడని చెప్పాలి. ఈ మూవీ కోసం రాహుల్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు.
హీరోయిన్ మహిమ రోల్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. చిన్న పిల్లలాగా కనపడింది. లుక్ పరంగా ఎక్కడా ఆట్టుకోలేదు. అజయ్ నటన హైలైట్ గా ఉన్న కొన్ని సన్నివేశాల్లో అతడి ఓవర్ యాక్షన్ శృతి మించిందని పిస్తుంది. జోగిబ్రదర్స్, శశాంక్ కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. విశ్వనాథ్ కాశీ రోల్ ఒకే.
సాంకేతిక విభాగం :
అచ్చు మ్యూజిక్ ఒకటి , రెండు సాంగ్స్ కే ఆకట్టుకున్నాయి..బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ కూడా పెద్దగా ఏం బాగాలేదు. సినిమా ఫోటోగ్రఫి విషయానికి వస్తే సాయిప్రకాష్ కెమెరా వర్క్ పర్వాలేదు అనిపించింది. విశాఖపట్నం అందాల్ని మరోసారి వెండి తెరపై బాగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్ :
చిత్రానికి ప్లస్ పాయింట్లలో చెప్పాల్సింది టైసన్ అదే.. రాహుల్. గతంతో పోలిస్తే చాలా మెచురిటీ ప్రదర్శించాడు. బాడీ కూడా పర్ ఫెక్ట్ గా మౌల్డ్ చేశాడు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కూడా చిత్రానికి ఆకర్ణణగా నిలిచింది. దీంట్లో ప్రధానంగా క్లైమాక్స్ సీన్ అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. తొలి అర్థ భాగంలో అక్కడక్కడా లాజిక్ లేని సీన్స్ కొంత మైనస్ గా కనిపిస్తాయి. ఫస్టాఫ్లో మరో ఐదు, పది నిమిషాలకు ఎడిటర్ తన కత్తెర కు పని చెపితే బాగుండు. డైరెక్టర్ వేణు డైరెక్షన్ గురించి చెప్పాల్సి వస్తే.. మొదటి భాగం లో అర్ధం , పర్థం లేని సన్నివేశాలు పెట్టి ప్రేక్షకులను విసిగించాడు. హీరోయిన్ సిగిరెట్ త్రాగటం, హీరో ఎస్సైను చంపే సీన్లలో మినిమమ్ లాజిక్ మిస్సైంది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా నడిపించినా.. సెకండ్ హాఫ్ స్పీడ్ పెంచి కవర్ చేసాడు.
చివరిగా :
‘వెంకటాపురం’లో సస్పెన్స్ లేకుండా మిస్టరీ వీడింది.