Asianet News TeluguAsianet News Telugu

శివగా నాగచైతన్య..పస్ట్ లుక్ అదిరిపోయింది!

  కస్టడీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎ శివ అనే పేరు గల కానిస్టేబుల్ గా నాగచైతన్య కనపడనున్నారు.
 

Venkat Prabhu action thriller Naga Chaitanya film  Custody film  First Look
Author
First Published Nov 23, 2022, 11:25 AM IST


 నాగ చైతన్య ...లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. అయితే  థ్యాంక్ యు సినిమా డిజాస్టర్ అయ్యింది. మరో ప్రక్క దూత వెబ్ సిరీస్ చేస్తున్నాడు చైతూ. ఈ క్రమంలోనే నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెలుగు -తమిళ్ లో బై లింగ్వల్ సినిమాగా ఓ సినిమాని అన్నౌన్స్ చేసి షూటింగ్ మొదలెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. కస్టడీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎ శివ అనే పేరు గల కానిస్టేబుల్ గా నాగచైతన్య కనపడనున్నారు.

 ఎన్‌సీ 22 (#NC22)గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. నాగ చైతన్య వెంకట్ ప్రభు సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. కృతి శెట్టి కూడా ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. అలాగే చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో బిజీ బిజీగా సినిమాలు చేసేస్తోంది కృతి. గతంలో నాగ చైతన్య – కృతి శెట్టి కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఈ జంట అదిరిపోయే కెమిస్ట్రీ పండించి హిట్ కొట్టడం కలిసొచ్చే అంశం.

  సమంతతో విడాకుల తర్వాత చైతూ కూడా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. మజిలీ, వెంకీ మామ, లవ్‌స్టోరీ, బంగార్రాజు ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.  బాలీవుడ్‌లోనూ ఆమీర్ ఖాన్‌తో కలిసి చేసిన లాల్ సింగ్ చద్ధా చిత్రంలోనూ నటించాడు మన చైతూ. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే ఈ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సారి తమిళ దర్శకుడితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అక్కినేని అభిమానులను దృష్టిలో ఉంచుకుని మంచి కమర్షియల్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు చైతూ. 

 పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న  ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.రీసెంట్గా  నాగచైతన్య  చేసిన థ్యాంక్యూ చిత్ర డిజాస్టర్ కావటం, అలాగే  లాల్ సింగ్ చద్ధా అదే పరిస్దితి ఎదురుకావటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.   

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చెన్నై 600028, సరోజ, గోవా, మనకథా లాంటి చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది శింబుతో చేసిన మానాడు చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios