విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత మునుపటి వెంకీని గుర్తుచేస్తూ ఎఫ్2 చిత్రం ద్వారా బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. రాశి ఖన్నా,పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

జై లవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలని ప్రారంభించారు. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తుంటే వెంకటేష్, నాగ చైతన్య కలసి చేయబోయే సందడి మామూలుగా ఉండదనిపిస్తోంది. 

మరి కొద్దిరోజుల్లోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం వినోదాత్మకంగా ఉండబోతోంది. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ గా, నాగ చైతన్య ఆర్మీలో పనిచేసే సైనికుడిగా నటిస్తున్నట్లు సమాచారం.