ప్రభాస్ ఫ్యాన్స్ ఈ జీప్ మోడల్ చూసి తెగ ఆనందపడుతున్నారు. రస్టిక్ లుక్ తో ఈ జీప్ డిజైన్ అయ్యింది. గన్ లేబుల్ కూడా ఈ జీప్ కు ముందు ప్రోపర్టీగా పెట్టారు. ఈ కారు చూడగానే ఓ బీస్ట్ ఫీల్ వస్తోంది. సినిమాలో హీరోయిజం ను ఎలివేట్ చేయటంలో ప్రశాంత్ నీల్ తీరే వేరు. 


ప్రభాస్ అభిమానుల అందరి దృష్టి ‘సలార్‌’ సినిమాపైనే ఉంది. రాధేశ్యామ్ తో దెబ్బ తిన్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ - స్టార్ హీరో ప్రభాస్‌ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ‘కె.జి.ఎఫ్‌’ తెరకెక్కించిన హోంబళే ఫిల్మ్‌ బ్యానర్ పైనే రూపొందుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి వచ్చే ప్రతీ అప్డేట్ చాలా ఆసక్తికరంగా ఉంటోంది. తాజాగా ఈ చిత్రం లో ప్రబాస్ వాడే జీప్ ఫొటో బయిటకు వచ్చింది. ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటో ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ జీప్ మోడల్ చూసి తెగ ఆనందపడుతున్నారు. రస్టిక్ లుక్ తో ఈ జీప్ డిజైన్ అయ్యింది. గన్ లేబుల్ కూడా ఈ జీప్ కు ముందు ప్రోపర్టీగా పెట్టారు. ఈ కారు చూడగానే ఓ బీస్ట్ ఫీల్ వస్తోంది. సినిమాలో హీరోయిజం ను ఎలివేట్ చేయటంలో ప్రశాంత్ నీల్ తీరే వేరు. అందుకు సింబాలిక్ గా ఈ జీప్ నిలవనుందని చెప్తున్నారు. హీరో ఎలివేషన్ బ్లాక్ లు సినిమాలో చాలా ఉండనున్నాయి. ఖచ్చితంగా ఈ ఫొటో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని రెట్టింపు చేస్తుందనటంలో సందేహం లేదు.



 నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాతో మాట్లాడుతూవిజయ్ ....ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోందని తెలియజేసారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రతి నెలా పదిహేను రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది కాకుండా ప్రతి నెలా వారం రోజులు ఆయన అవసరం లేని సీన్స్ ని చిత్రీకరిస్తారు. అలాగే ‘సాలార్‌’ యాక్షన్‌ అత్యద్భుతంగా ఉంటుందని విజయ్‌ కిరగందూర్‌ హామీ ఇచ్చారు. యాక్షన్ గెటప్ లో ప్రభాస్‌ని చూడటం అతని అభిమానులకు ట్రీట్ అవుతుంది. అభిమానులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆయన తెలిపారు.

ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తుండగా, భువన్‌ గౌడ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మేకింగ్ కోసం భారీ బడ్జెట్‌ కేటాయించిన టీమ్ ఎక్కడా తగ్గేదేలే అంటోంది. ఈ భారీ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ కూడా భాగం కాబోతున్నట్లు ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మునుపెన్నడూ చూడనంత హైలైట్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండటం మరింత ఇంట్రస్ట్ రేకెత్తిస్తోంది. 

సినిమాలో యాక్షన్‌కి తోడు గ్లామర్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. శ్రద్ద కపూర్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారట. ఇక ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యిన నేపధ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు సలార్ మీదే ఆశ పెట్టుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఖచ్చితంగా సలార్ తో పెద్ద హిట్ కొడతాడని ఘంటాపధంగా చెప్తున్నారు.