Asianet News TeluguAsianet News Telugu

ఆన్లైన్లో టికెట్స్ ఫుల్ థియేటర్స్ లో జనాలు నిల్..ఇది ఆ కులపోళ్ల పనే అంటున్న మెగా ఫ్యాన్స్!


ఆన్లైన్లో టికెట్స్ ఫుల్ థియేటర్స్ లో జనాలు నిల్... యూఎస్ లో బాలయ్య వీరసింహారెడ్డి మూవీ కలెక్షన్స్ పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారమిది.
 

veerasimhareddy us collections is fake says mega fans
Author
First Published Jan 12, 2023, 11:39 AM IST

 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ లెక్కలన్నీ ఫేకే. ఈ సినిమా ఆ సినిమా అని లేదు, ప్రతి స్టార్ హీరో సినిమా అసలు వసూళ్లకు లెక్కల్లో చూపించే వసూళ్లకు 30%-40% వ్యత్యాసం ఉంటుంది. చిన్న హీరోల మిరాకిల్ హిట్స్ విషయంలో మాత్రమే కచ్చితమైన లెక్కలు బయటకు వస్తాయి. అత్యధిక కలెక్షన్స్ చూపించి మా సినిమా హిట్, చాలా బాగుందని ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం అది. 

యూఎస్ లో అది కుదరదు. అక్కడ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. తెగే ప్రతి టికెట్ కౌంట్ అవుతుంది. ఎక్కువ చేసి చూపడానికి లేదా తగ్గించడానికి వీలు లేదు. కాబట్టి యూఎస్ కలెక్షన్స్ ఖచ్చితత్వంతో కూడుకొన్నవిగా ట్రేడ్ వర్గాలు భావిస్తాయి. జనాలకు అవగాహన పెరిగాక వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. కాగా సంక్రాంతి బరిలో దిగిన వీరసింహారెడ్డి(Veerasimhareddy), వాల్తేరు వీరయ్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

మెగా వర్సెస్ నందమూరి వార్ గా అభిమానులు దీన్ని భావిస్తున్నారు. హిట్ కొట్టి ప్రత్యర్థుల మీద పైచేయి సాధించాలని ఆశపడుతున్నారు. దీని కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు వాడుకోవాలని చూస్తున్నారు. కాగా యూఎస్ బుకింగ్స్ లో మొదటి నుండి వీరసింహారెడ్డి జోరు చూపిస్తుంది. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)వెనుకబడింది. కలెక్టన్స్ పరంగా చూస్తే యూఎస్ లో వీరసింహారెడ్డి చిత్రం ముందుంది . అయితే ఇదంతా కుట్రపూరిత వ్యవహారమే కానీ వాస్తవంలో వీరసింహారెడ్డికి యూఎస్ లో అంత హైప్ లేదంటున్నారు.

ఆన్లైన్లో టికెట్స్ ఫుల్ అయినట్లు చూపిస్తుంటే థియేటర్స్ లో మాత్రం సీట్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయట. అంటే కొద్ది మంది వీరసింహారెడ్డి చిత్ర టికెట్స్ మొత్తం ఆన్లైన్ కొనేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి వేల సంఖ్యలో టికెట్స్ బుక్ చేశారు. దీని వెనుక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఉందంటున్నారు. బాలకృష్ణ సామాజిక వర్గానికి చెందిన తానా సభ్యులు తమ సొంత డబ్బులు కోట్లు ఖర్చు చేసి వీరసింహారెడ్డి కి అధిక కలెక్షన్స్ గా చూపించారని మెగా ఫ్యాన్స్ ఆరోపణ. 

దీనికి ఆధారాలుగా ఖాళీగా ఉన్న థియేటర్స్ సీట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి వారి ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ... వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి యూఎస్ కలెక్షన్స్ అధికంగా రావడానికి బాలకృష్ణ సామాజిక వర్గం వారు కుట్ర పన్నారంటున్నారు. నిజం చెప్పాలంటే కమ్మ వెర్సస్ కాపు అన్నట్లు ఈ సంక్రాంతి వార్ ఉంది. చికాగోలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే.  ఇంత ప్రెస్టీజియస్ వార్ నడుమ వీరసింహారెడ్డి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా ఫలితం ఏమిటనేది పండగ తర్వాతే తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios