ఎన్టీఆర్ చేసుంటే బాగుండేదంటున్నారు... వీరసింహారెడ్డి డైరెక్టర్ కామెంట్!
వీరసింహారెడ్డి మూవీలో కొడుకు క్యారెక్టర్ ఎన్టీఆర్ చేసి ఉంటే బాగుండేదని ప్రేక్షకుల అభిప్రాయమట. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆయన బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. క్రాక్, వీరసింహారెడ్డి టాలీవుడ్ సూపర్ హిట్స్ లిస్ట్ లో చేరాయి. క్రాక్ తో రవితేజకు వీరసింహారెడ్డితో బాలయ్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి బాలయ్య గత హిట్ అఖండ వసూళ్ల రికార్డులు బద్దలు కొట్టింది. అలాగే బాలయ్యను వెంటాడుతున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ ని వీరసింహారెడ్డి చిత్రం అధిగమించింది. హిట్ కొడితే బాలయ్య ఆ నెక్స్ట్ మూవీతో ఖచ్చితంగా ఫ్లాప్ ఇస్తాడు. దశాబ్దాల తర్వాత బాలకృష్ణ ఆ సెంటిమెంట్ అధిగమించి వరుస హిట్స్ కొట్టాడు.
కాగా వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. వీరసింహారెడ్డి, జైసింహారెడ్డి పాత్రల్లో తండ్రీకొడుకులుగా అలరించారు . అయితే జైసింహారెడ్డి పాత్ర ఎన్టీఆర్ చేస్తే బాగుండేదని మెజారిటీ ఆడియన్స్ గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి చెప్పారట.కథ రీత్యా ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ కి చక్కగా సెట్ అయ్యేదని, ఆయన నటించి ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది అంటున్నారట.
ఇక బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. బాలయ్య సైతం దీనికి ఓకే చెప్పారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పటికైనా సాకారం అవుతుందేమో చూడాలి. మిక్స్డ్ రివ్యూలు సొంతం చేసుకున్న వీరసింహారెడ్డి సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు.