బాలకృష్ణ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఘట్టం దగ్గరికి వచ్చింది. `వీరసింహారెడ్డి` సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి సంబంధించిన అప్‌డేట్లు వచ్చాయి.
ఈ సంక్రాంతి రసవత్తరంగా ఉండబోతుంది. ఇద్దరు సీనియర్లు పోటీ పడి వస్తున్నారు. ఓ వైపు మెగాస్టార్, మరోవైపు నందమూరి నటసింహాం.. బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటేందుకు వస్తున్నారు. తెలుగు ప్రజలకు డబుల్ వినోదాన్ని ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరు నటించిన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఇందులో ముందుగా రాబోతుంది బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా యాక్షన్, ప్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12న విడుదల కాబోతుంది.
శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు దమ్ములేపుతున్నాయి. మేకింగ్ వీడియో సైతం ఆకట్టుకుంది. ఇప్పుటికే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ఆ పునకాలను రెట్టింపు చేసే మరో భారీ సర్‌ప్రైజ్ రాబోతుంది. ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది యూనిట్. అంతేకాదు భారీ ఈవెంట్‌ని నిర్వహించబోతుంది. ఆ వివరాలను తాజాగా వెల్లడించారు.
`వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు. ఈనెల 6న ఒంగోల్‌లోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని భారీగా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. మరోవైపు అదే రోజు సాయంత్రం ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ లీక్ చేశాడు. ఇప్పుడే వీరసింహారెడ్డి ట్రైలర్ చూశా. ఫైర్ అని ఎమోజీలు పంచుకుంటూ రచ్చ రచ్చ.. జనవరి 6న ఫైర్ ఫైర్ ఫైర్ అని ట్వీట్ చేశారుథమన్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈవెంట్‌కి రెడీ అవుతుంది.
