రిలీజైన మొదటి షో నుండి అన్ని చోట్ల హౌజ్‌ ఫుల్‌ బోర్డులలు పడిపోయాయి. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత గోపిచంద్‌ మలినేని.. ఇద్దరు కలిసి రావడంతో...


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజునే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆ తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చాక డ్రాప్ ప్రారంభం అయ్యింది. తాజాగా ఈ సినిమా థియేటర్ బిజినెస్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్ ఎంత..అనేది చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ షేర్ ...75.7 కోట్లు సాధించింది. అఖండ తర్వాత ఈ సినిమా మరోసారి భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. అయితే గ్రాస్ నెంబర్స్ మాత్రం అఖండ టాప్ లో ఉంది. ఇప్పటికీ కొన్నిచోట్ల పర్శంటేజ్ మీద ఈ సినిమా ఆడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం క్లోజింగ్ 75.90 కోట్లు (69.95 కోట్లు Excl GST) సాధించింది. అందులో ఆంధ్రా,తెలంగాణా కలిసి 65.50 Cr, ఓవర్ సీస్ 5.85 Cr, రెస్టాఫ్ ఇండియా 4.55 Cr వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్లు చేసింది. కాబట్టి సినిమా సకెస్స్ ఫుల్ గా నడిచింది. అలాగే...ఈ సినిమా ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్క్, యూట్యూబ్ రైట్స్, హిందీ రైట్స్ అదనం. వాటిద్వారా భారీగా నిర్మాతకు లాభం వస్తుంది. 

 ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత గోపిచంద్‌ మలినేని.. ఇద్దరు కలిసి రావడంతో ప్రేక్షకులు థియేటర్‌లకు పోటెత్తారు. దానితో పాటుగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లు, ట్రైలర్‌ సినిమాపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల నడుమ గురువారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్‌ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల పరంగా కుమ్మేయటం కలిసొచ్చింది. అటు ఓవర్సీస్‌లో (Oversease) కూడా ఈ రెండు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా యూఎస్‌ బాక్సాఫీస్ (US Boxoffice) వద్ద వీరయ్య, వీరసింహా కనకవర్షం కురిపించాయి.