Asianet News TeluguAsianet News Telugu

Ennenno Janmala Bandham: యాష్, వేద పెళ్లిరోజు సెలబ్రేషన్స్ ఆగిపోయేలా చేసిన విన్నీ.. టెన్షన్ లో వేద?

Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. ఇద్దరి మధ్య అనురాగం ఉన్నా.. చిన్న చిన్న అవంతరాల వల్ల దగ్గర కాలేకపోతున్న భార్య భర్తల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Vedaswini feels happy with Yash's surprise for their anniversary in todays ennenno janmala bandham serial gnr
Author
First Published Mar 27, 2023, 12:02 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో మంచి ఎక్సైట్మెంట్లో ఉన్న యష్ వేద ఇంకెంత ఎగ్జాట్మెంట్లో ఉంటుందో తను ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో ఏంటో క్యూరియాసిటీ  తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ వేద కోసం వెయిట్ చేస్తుంటాడు యష్. టైం చాలా అవటంతో వేద ఇంకా రాలేదు.. మరిచిపోయిందా లేకపోతే రాలేకపోతుందా అనుకుంటాడు. మరోవైపు వేద కూడా రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతుంది.

ఆలోచిస్తూనే నిద్రపోయిన వేదని చూస్తూ కూర్చుంటాడు విన్ని. సడన్ గా వేదకి మెలకువ రావటంతో విన్ని ని చూసి నీకు ఓకే కదా అని అడుగుతుంది. ఇప్పుడు బానే ఉంది కానీ నువ్వు పడుకున్నావు కదా అందుకే డిస్టర్బ్ చేయలేదు చాలా లేట్ అయింది నువ్వు బయలుదేరు అని చెప్తాడు. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. తెల్లవారుతూనే ఇంటికి వచ్చిన వేదని ఎక్కడికి వెళ్లావు..

ఈ రోజు మీ మొదటి పెళ్లి రోజు కదా ఇంట్లో లేవా అని అడుగుతుంది సులోచన. దాంతో జరిగిందంతా చెప్తుంది వేద. అర్ధరాత్రి 12 గంటలకి అల్లుడు గారికి శుభాకాంక్షలు చెప్పాలని ఆరాట పడ్డావు కదా నీకోసం అల్లుడుగారు కూడా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు  అంటుంది సులోచన. ఆయనకి చెప్పే వెళ్లాను అంటుంది వేద. ఈరోజు నువ్వు ఇలా బయటికి వెళ్లడం కరెక్ట్ కాదనిపిస్తుంది.

డాక్టర్ గా నీకు ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి కాదనను కానీ అంతకన్నా ముఖ్యం ఒక భార్యగా భర్త దగ్గర ఉండటం. పూర్తిగా తెల్లవారిపోయింది అయినా నేను నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పను మొదటిగా మీ భర్త నోటి నుంచే నువ్వు ఆ శుభాకాంక్షలు వినాలి అంటూ యష్ దగ్గరికి వేదని పంపిస్తుంది సులోచన. గదిలోకి వచ్చిన వేద నిద్రపోయిన యష్ ని చూస్తుంది.

గోడమీద హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డెకరేషన్ ని కూడా చూస్తుంది. చాలా ఎమోషనల్ అవుతూ యష్ పక్కనే కూర్చుని నాకోసం ఎదురు చూసి చూసి అలసిపోయి పడుకొని ఉంటారు అనుకుంటుంది. అందరూ నా రాక వల్ల మీ జీవితంలో సంతోషం వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ నీవల్లే నా జీవితానికి ఒక అర్థం అమ్మతనం వచ్చాయి. భర్త వల్ల భార్యకి సౌభాగ్యం వస్తుంది.

కానీ అంతకుమించి మీరు నాకు అమ్మతనాన్ని  కూడా ఇచ్చారు. ఖుషి వల్ల ఎంత ఆనందాన్ని పొందుతున్నానో, మీ భార్యగా కూడా అంతే ఆనందాన్ని పొందుతున్నాను. మన పెళ్లయి అప్పుడే సంవత్సరం అయింది అంటే నమ్మలేకపోతున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ప్రతిరోజు ఒక క్షణం లాగా గడిచిపోయేది. మీతో నా బంధం ఎన్నెన్నో జన్మల బంధం గా ఉండిపోవాలని కోరుకుంటున్నాను అంటూ యష్ చేతిని ముద్దు పెట్టుకుంటుంది.

సోఫాలో కూర్చొని నిద్రపోతున్న భర్తని సరిగా పడుకోబెట్టి అతని చేతిలో ఉన్న బొకే తీసుకొని అతనికి కూడా హ్యాపీ యానివర్సరీ చెప్తుంది. అతను ఎప్పుడు లేస్తాడా అని పక్కనే వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు పాయసం చేస్తున్న ఖుషి ని చెఫ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మెచ్చుకుంటాడు వసంత్. ఇదంతా మా వేద అక్క ట్రైనింగ్ అంటుంది చిత్ర. నన్ను పాయసం చేయనిస్తారా చేయనివ్వరా అంటుంది ఖుషి.

అవునవును మా ఖుషి బేబీ చాలా బిజీ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అంటుంది మాలిని. వేద ఏదో చెప్పబోతుంటే నేనేమీ చిన్నపిల్లను కాదు నాకు అంతా తెలుసు నేనే చేస్తాను ఇప్పుడు నేను బిగ్ బేబీ అంటుంది ఖుషి. పాయసం చేయటం పూర్తయింది. అమ్మ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టు అని ఆర్డర్ వేస్తుంది. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను అంటే నేను టెస్ట్ చేస్తాను అంటూ పోటీ పడతారు చిత్ర, వసంత్. ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు.

నేను ఫస్ట్ టైం చేసిన స్వీట్ ని ఫస్ట్ టైం మా డాడీ టేస్ట్ చేయాలి అంటుంది ఖుషి. అమ్మని నేను పక్కనే ఉన్నాను కానీ.. డాడీ టేస్ట్ చేయాలంట అని ఉడుక్కుంటుంది వేద. అవును నాకు మా డాడీ ఫస్ట్ అంటుంది ఖుషి. మూతి ముడుచుకున్న వేదని చూసి నువ్వేమీ కంగారు పడకు నన్ను మెచ్చుకొని డాడీ గిఫ్ట్ ఇస్తారు కదా ఆ గిఫ్ట్ నేను నీకు ఇచ్చేస్తానులే అంటుంది  ఖుషి.

అంతలోనే యష్ వచ్చి ఎక్కడ మా ఖుషి బేబీ చేసిన పాయసం ఎక్కడ అంటూ ఖుషి దగ్గరికి వస్తాడు. తండ్రి నోటిలో పాయసం పెడుతుంది. అది తిన్న యష్ పాయసం అంటే ఇది సూపర్ గా ఉంది పాయసం ఎలా చేయాలో నా కూతురు దగ్గర నేర్చుకోండి అంటూ గొప్పగా చెప్తాడు. తరువాయి భాగంలో ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ లో వేదకి ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేస్తాడు యష్. ఎంతో ఆనందపడుతుంది వేద. మీ ఫస్ట్ యానివర్సరీ లాస్ట్ యానివర్సరీ కావాలి అంటూ యానివర్సరీ వెల్కమ్ బోర్డుకి నిప్పు పెట్టేస్తాడు విన్ని. అది చూసి కంగారుపడుతుంది వేద.

Follow Us:
Download App:
  • android
  • ios