Asianet News TeluguAsianet News Telugu

VD13కి నామకరణం.. Title Teaserకు డేట్, టైమ్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదిలిన యూనిట్

విజయ్ - పరుశురామ్ కాంబోలో మరోసారి తెరకెక్కబోతున్న చిత్రం VD13. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారు. అనౌన్స్ మెంట్ డేట్, టైమ్ ను ఫిక్స్ చేస్తూ  తాజాగా అప్డేట్ అందించారు. 
 

VD13 Movie Title Teaser Release Date Announced NSK
Author
First Published Oct 15, 2023, 2:18 PM IST

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫుల్ జోష్ మీద ఉన్నారు. ‘ఖుషి’తో మంచి హిట్ అందడంతో అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నారు. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ వహిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో విజయ్ లైనప్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల్లో VD13పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ను పరుశురామ్ పెట్ల డైరెక్ట్ చేయడమే అందుకు కారణం. వీరిద్దరి కాంబోలో ‘గీతాగోవిందం’ వచ్చి హిట్ అయిన విషయం తెలిసిందే. 

ఇక రెండోసారి విజయ్ - పరుశురామ్ పెట్ల కలిసి వర్క్ చేస్తుండటంతో వీడీ13పై హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే యూనిట్ సాలిడ్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగం మేర పూర్తి చేసినట్టు అప్డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా టైటిల్ టీజర్ (VD13 Title Teaser) పై అప్డేట్ అందించారు. అక్టోబర్ 18న సాయంత్రం 6 :30 నిమిషాలకు అనౌన్స్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ అప్డేట్ అందిస్తూ యూనిట్  ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండ ఉద్యోగి అని అర్థం అవుతోంది. అలాగే స్కూల్ పిల్లలను తీసుకెళ్తూ ఓ దృశ్యాన్ని చూపించారు. దీంతో విజయ్ పాత్రపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక మూడురోజుల్లో చిత్ర టైటిల్ విడుదల కాబోతోంది. దాంతోనే ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ‘ఖుషి’ తర్వాత విజయ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అదరగొడుతోంది. 

గత నాలుగైదు చిత్రాలతో వరుస ఫ్లాప్స్ ను అందుకుంటూ వచ్చారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ చేతిలో VD12, VD13 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి. మొత్తం నాలుగు చిత్రాలతో విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక VD13ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై 54వ చిత్రంగా నిర్మిస్తున్నారు.  క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి 2024లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios