Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి ధరణి కోసం వంట గదిలోకి వెళ్ళగా ఇంతలో అక్కడికి ధరణి వచ్చి ఏమీ కావాలి అనగా అన్నయ్య గురించి మాట్లాడడానికి వచ్చాను వదిన అనడంతో టాపిక్ వస్తుంది కానీ మీ అన్నయ్య మాత్రం రావడం లేదు కదా రిషి అని అంటుంది. జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి అని అందరూ కలలు కంటారు కానీ అందరికీ అలాగే ఉండదు అని అంటుంది. వదిన మీరు చెప్పింది చాలా వరకు నిజం అనగా చాలావరకు ఏంటి రిషి పూర్తి నిజం అని అంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించినా జరగని పనులు అలా అలా జరిగిపోతాయి వదిన అని అంటాడు రిషి. అన్నయ్య వస్తాడని ఇన్ని రోజులుగా ఎదురు చూశారు మీరు చాలా గొప్పవారు వదిన అని అంటాడు.
కొన్నాళ్లు వస్తాడని అనుకున్నాను మరికొన్ని రోజులు అసలు వస్తాడో రాడు అనుకున్నాను అనగా అక్కడ అన్నయ్యకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కదా వదినా అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఈ వసుధార ఎక్కడ ఉండలేదు అనవసరంగా శైలేంద్ర టాపిక్ తీసింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ధరణి రిషి తో మాట్లాడుతూ నేను ఎప్పుడూ పెద్దత్తయ్యతో శైలేంద్ర గురించి మాట్లాడలేదు అప్పుడు రిషి ఇక వదిలేయండి వదిన మిగతా నేను చూసుకుంటాను అని అంటాడు రిషి. తరువాత వసు రూమ్ కి వెల్లగా అక్కడ వసు లేకపోవడంతో టెర్రస్ పైకి వెళ్తాడు. అప్పుడు వసుధార వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఆ మాటలు వింటూ ఉంటాడు.
నీకోసం అంత వెతికి ఇక్కడి వరకు వచ్చాను మీ అమ్మ నాన్నకి బాగానే కవరింగ్ ఇస్తున్నావు కదా అని అంటాడు రిషి. ప్రతి విషయాన్ని మీ అమ్మానాన్నలకు చెప్పాలా అనడంతో వాళ్లే అడుగుతారు సార్ అని అంటుంది వసు. ప్రతి అమ్మాయి అత్తారింటికి వెళ్తే తల్లిదండ్రులకు భయం ఉంటుంది కదా సార్ అని అనగా మభ్యపడుతున్నావా అని అంటాడు రిషి. అప్పుడు వసు మీరు నాకోసం రావాలా సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అనగా నువ్వు వచ్చే అధికారం ఇంకా రాలేదని అనుకుంటున్నాను అంటాడు రిషి. ఈ సమయంలో నువ్వు నా గదికి రావడం కరెక్ట్ కాదు అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవయాని వీరిద్దరూ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లి ఉంటారు అని అక్కడికి వచ్చి వసులను చూసి షాక్ అవుతుంది.
అప్పుడు వసు,రిషి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నువ్వు వచ్చాక నా జీవితంలో చాలా మారిపోయాయి వసుధార అంటూ చేతులు విడిచిపెట్టి మౌనంగా ఉంటాడు రిషి. ఆగిపోయారు ఏంటి సార్ అనగా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటాడు రిషి. మన మధ్య ఎంత ప్రేమ ఉందో దూరం అంతే ఉంది అది నన్ను భయపడుతుంది అనడంతో ఇదే కదా నాకు కావాల్సింది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. సార్ గుడ్ నైట్ చెప్పరా అని అనడంతో నువ్వు చెప్పొచ్చు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరొకవైపు జగతి,మహేంద్ర ధరణి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి అనవసరంగా వసుధార శైలేంద్ర టాపిక్ తీసింది దానివల్ల దేవయాని అక్కయ్య ధరణిని మరింత బాధ పెడుతుంది అని అంటుంది.
ఈ విషయంలో మనం ఏమి చేయలేము అనడంతో ఈ విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలి అని అంటాడు మహేంద్ర. అప్పుడు ధరణి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. తర్వాత అందరూ ఒకచోట కూర్చొని ఉండగా ఇంతలో ఫణీంద్ర అమ్మ ధరణి అందరికీ కాఫీ తీసుకుని రామ్మా అనడంతో ఇంతలో దేవయాని అందరికీ అవసరం కాఫీ తీసుకొని రావడంతో అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి పెద్దమ్మ మీరు కాఫీ తెస్తున్నారు అనగా అదేం లేదు రిషి అందరికీ కాఫీ ఇవ్వాలని అనిపించింది అంటుంది దేవయాని. అప్పుడు అందరికీ దేవయాని కాఫీ ఇస్తుంది. ఇప్పుడు దేవయాని ఈరోజు మీరెవరు కాలేజీకి వెళ్లడం లేదు ఎందుకంటే ఈరోజు పూజ చేస్తున్నాము అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు.
వదిన సడన్ గా ఈ వ్రతం ఏంటి అనడంతో కొత్తగా పెళ్లయిన దంపతులు ఇంట్లో ఉన్నప్పుడు వ్రతం చేసుకోవడం సాంప్రదాయం కదా అని అంటుంది దేవయాని. నీకు జగతికి ఇవి పట్టవు కాబట్టి నేను అన్ని సిద్ధం చేయించాను అని అంటుంది దేవయాని. తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మహేంద్ర,జగతి గదిలోకి వెళ్లి ఏంటి జగతి ఇది సడన్ గా వదిన గారు వ్రతం చేద్దామని అంటున్నారు అని అంటాడు మహేంద్ర. వదిన గారు ఏదో ప్లాన్ చేశారు జగతి అనగా అవును మహేంద్ర అని అంటుంది జగతి. అప్పుడు ఇద్దరు కన్ఫ్యూజన్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత దేవయాని ధరణి ఇద్దరు దగ్గరుండి పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలోనే జగతి అక్కడికి రావడంతో ఇల్లు చాలా సంతోషంగా ఉంది కదా జగతి అంటూ నాటకాలు ఆడుతూ జగతితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని.
