Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu: ధర్మరాజుకు దిమ్మతిరిగే షాకిచ్చిన రిషి.. వసుతో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

Vasu and rishi come up with a plan in todays guppedantha manasu serial gnr
Author
First Published Mar 27, 2023, 7:32 AM IST

ఈరోజు ఎపిసోడ్ లో రిషి వద్దు వసుధార వెళ్లొద్దు ఆగు అని అంటుండగా ఏమి కాదు సార్ నేను వెళ్ళొస్తాను అని అక్కడికి వెళుతుంది వసుధార. ఇంతలోనే అక్కడికి ధర్మరాజు రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసు. అప్పుడు ధర్మరాజు కూడా షాక్ లో వసుధార వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వసుధారా అని పిలిచి కళ్ళు నిలుముకుంటుండగా ఇంతలో రిషి వసుధార గట్టిగా లాక్కొని ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడు రిషి వసుధర ఇద్దరు ఒకరి పైన ఒకరు పడటంతో పెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ధర్మరాజు ఇదంతా నా బ్రమ అనుకుంటూ బెడ్ పై పడుకుంటాడు.

అప్పుడు వసుధార రిషి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తారు. తర్వాత వాళ్లకు కావాల్సిన బండల్స్ తీసుకొని వేస్ట్ పేపర్లు పెట్టిన మూడు బండల్స్ ని అక్కడే పెడతారు. అప్పుడు వసుధార నువ్వు సూపర్ అని అంటాడు రిషి. అప్పుడు బయటకు వెళ్లి ఎలా వెళ్లాలో తెలియక ధర్మరాజు వచ్చి డోర్ తీయాలని అంటాడు రిషి. అప్పుడు రిషి కావాలనే లోపలి నుంచి తలుపు కొట్టి పక్కకు వెళ్లి దాకుంటాడు. అప్పుడు రెండోసారి వెళ్లి తలుపులు కొట్టగా అప్పుడు ధర్మరాజు వచ్చి తలుపులు తీయడంతో రిషి వసుధార తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రిషి, వసు ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు స్క్వాడ్ వస్తున్నారు అని కాలేజీలో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.

ధర్మరాజు స్క్వాడ్ని తీసుకుని వచ్చి మీ కాలేజీలో ఏవో అవకతవకలు జరిగాయంట ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగా అదేం లేదు అని అంటాడు మహేంద్ర. అప్పుడు సరే సరే రండి వెళ్దాం పదండి అని అంటాడు ధర్మరాజు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి చూడగా గదికి తాళం వేసి సీల్ వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి వీళ్లే మళ్లీ తాళం వేసి సీల్ వేశారా అని అనుకుంటూ ఉంటాడు. అయినా మీ చెకింగ్ మీరు చేయండి సార్ అని అంటాడు ధర్మరాజు. ఆ కాలేజీ పేపర్స్ కి లిస్టు కి సంబంధించిన లిస్టు ని ఇస్తుంది జగతి. ఆ తరువాత మహేంద్ర వెళ్లి గది తలుపులు ఓపెన్ చేస్తాడు.

 అప్పుడు లోపల మూడు బండల్స్ మిస్ అయి ఉంటాయి లోపలికి వెళ్తే అసలు విషయం బయట పడుతుంది అప్పుడు నేను రెచ్చిపోతాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ధర్మరాజు. అప్పుడు లోపలికి వెళ్లిన స్క్వాడ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అని బయటకు వచ్చి చెప్పడంతో ధర్మరాజు షాక్ అవుతాడు. వసుధార, మహేంద్ర కాలేజీ సిబ్బంది అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఒకసారి చెక్ చేయండి సార్ అని ధర్మరాజు టెన్షన్ తో మాట్లాడగా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్ ఎందుకు మీరు అంతలా టెన్షన్ పడుతున్నారు అని అంటాడు స్క్వాడ్.

నేను వస్తాను మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం సార్ అనగా వెళ్దాం పదండి అని లోపలికి వెళ్లి ధర్మరాజు అక్కడ పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి ఇక్కడికి ఇవి ఎలా వచ్చాయి అనుకుంటూ ఉంటాడు. ధర్మరాజు ఆలోచనలో పడగా రిషి, వసుధార ఒకరి వైపు ఒకరు చూసి సంతోష పడుతూ ఉంటారు. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో అసలు ఏం జరిగింది వసు అని జగతి అడగగా అవును సార్ మీకు ధర్మరాజు మీద ఎలా డౌట్ వచ్చింది అని అంటుంది వసుధార. అప్పుడు రిషి జరిగింది మొత్తం వివరిస్తాడు. ఆ తర్వాత ధర్మరాజు వెళ్తుండగా రిషి ధర్మరాజును పిలుస్తాడు.

ఏంటి ధర్మరాజు గారు ఆ మూడు బండల్స్ ఎలా వచ్చాయని అనుకుంటున్నారా అనగా ఏం మాట్లాడుతున్నారు సార్ అనడంతో నాకు మొత్తం తెలుసు మీరు చేసిన కుట్రలన్నీ నాకు తెలుసు అని అంటాడు రిషి. అప్పుడు ధర్మరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరు ఎలా అయితే దొంగతనం చేశారు మేము కూడా అలాగే దొంగతనం చేసాము మీకు గెస్ట్ హౌస్ కి వచ్చి అనగా మీరు నాకు గెస్ట్ హౌస్ కి ఎలా వస్తారు అనడంతో  మేము మీలాగా కాదు అనడంతో అప్పుడు ధర్మరాజు వేలు చూపిస్తాడు. చూడండి ధర్మరాజు గారు మీతో ఇదంతా వెనక ఉండి ఎవరో చేస్తున్నారో నాకు తెలుసు అని అంటాడు రిషి.

అప్పుడు రిషి స్వీట్ గా వార్నింగ్ ఇస్తూ ఎంతో మందికి చదువు చెప్పాల్సిన వారు మీరు జైలుకు వెళ్లడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి అని అంటాడు. అప్పుడు ధర్మరాజు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తరువాత రిషి ఒక చోట కూర్చోగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి ఏంటి సార్ రమ్మని మెసేజ్ చేశారు అని అంటుంది. కూర్చో వసుధార అని చెప్పి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు అని అంటాడు రిషి. దేని గురించి సార్ అనగా మన గురించి అని అంటాడు. మనిద్దరం ఒకరికొకరు దగ్గరగా ఉంటున్నా కూడా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం అని అంటాడు రిషి.

ఒకే ఇంట్లో ఉంటున్నాము గోడలు గదులుని వేరు చేసినట్టు రిషి బాధగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా నా పక్కనే చేతికి అందే అంత దూరంలో ఉన్నావు కానీ నా మనసుకు మాత్రం చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటాడు. నిజానికి మనల్ని దూరం చేస్తుంది మన ఆలోచనలు, మన అభిప్రాయాలు అని అంటుంది వసుధార. ఆ అడ్డులన్ని తొలగిపోవాలి అంటున్నాను వసుధార అని అంటాడు రిషి. మధ్య ఉన్న ఆగాదాలు అడ్డంకులు అన్ని తొలగిపోవాలి అనడంతో వసుధార రిషి దగ్గరకు జరిగే రిషి చేతిని పట్టుకుంటుంది. నేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. ఉద్దేశ పూర్వకంగా నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోవడం లేదు కానీ  నేను చేసిన పనులు నా ఆలోచనలు మిమ్మల్ని వేదనకు గురి చేస్తున్నాయి అని అంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios