స్పెస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అంతరిక్షం 9000KMPH ఒక జానర్ అయితే శర్వా పడి పడి లేచే మనసు పూర్తిగా వరుణ్ సినిమాకు బిన్నంగా లవ్ ఎంటర్టైనర్ గా రానుంది. 

అయితే వరుణ్ సినిమాలో కూడా కొంచెం లవ్ యాంగిల్ ఉన్నట్లు దర్శకుడు ట్రైలర్ అండ్ సాంగ్స్ తో చెప్పాడు. ఇప్పుడు సమన మార్కెట్ ఉన్న శర్వా - వరుణ్ ల ఫైట్ ఇంట్రెస్టింగ్ మారింది. గతంలో ఇద్దరు ఇతర సినిమాలతో పోటీ పడి గెలిచినవారే. అయితే అన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. కాస్తా తేడా కొట్టినా కెరీర్ కు దెబ్బె. సినీ పెద్దలు ఇద్దరు గెలవాలని అనుకుంటున్నారు గాని ఈ రోజుల్లో రన్నింగ్ రేజ్ లాంటి బాక్స్ ఆఫీస్ ఫొటిలో విన్నర్ గా నిలిచేది ఒక్కరే. 

ఇద్దరి సామర్ధ్యాల గురించి ఓ లుక్కేస్తే.. అంతరిక్షం సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఘాజి సినిమాతో హిట్టందుకున్న సంకల్ప్ దర్శకత్వం వహించడం.. క్రిష్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు వరుణ్ తేజ్ గత చిత్రాలు మంచి హిట్టయ్యాయి. ఫైనల్ గా సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. దీంతో అంతరిక్షం క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం పక్కా

శర్వా.. పడి పడి లేచే మనసు విషయానికి వస్తే.. మనోడి సినిమాలిప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. శతమానం భవతి సినిమా నుంచి మార్కెట్ కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు యూత్ ని ఇప్పటికి ఎట్రాక్ట్ చేస్తుంది. దీంతో ఆ ఇంపాక్ట్ ఈ లవ్ స్టోరీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. పైగా సాయి పల్లవి క్రేజ్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. దర్శకుడు హను రాఘవపూడి గత చిత్రం 'లై' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ సినిమాపై ప్రభావం పడేలా కనిపించడం లేదు.

ఇక ఈ రెండు సినిమాలకు సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికెట్స్ రావడంతో పాటు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దేనికదే పూర్తి బిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో బావుంటే సినిమాల కలెక్షన్స్ పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరెంత వసూలు చేస్తారన్నది వేచి చూడాలి. ఫైనల్ విన్నర్  స్పెస్ థ్రిల్లరా? లేక లవ్ ఎంటర్టైనరా?.. లెట్స్ వెయిట్ అండ్ సి.