కథ:

వెనకా ముందు ఆలోచించకుండా తనకు అనిపించింది అనిపిచ్చినట్లు ఆలోచించకుండా వెంటనే చెప్పేసే టైప్ స్టూడెంట్ ఆదిత్య(వరుణ్ తేజ్). ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా వుండే ఆదిత్య రైళ్లో ఊరికి ప్రయాణిస్తాడు. అయితే సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చే ఫ్రెండ్స్... కూల్ డ్రింక్ లో డ్రింక్ కలిపి తీసుకొస్తారు. అయితే ఆలస్యంగా వచ్చిన ఫ్రెండ్ అది తేవడం  లేట్ అవటంతో ఆదికి క్యాచ్ విసురుతారు. అది మిస్ అవుతుంది. అప్పుడు ఫ్రెండ్ నీకు అదృష్టం లేదురా అంటాడు. వెంటనే ఛాలెంజ్  గా తీసుకుని ముందుకెళ్తున్న రైల్లో కోచ్ ల గుండా వెనక్కి వచ్చి బాటిల్ తీసుకుంటాడు  ఆది. అలా కాదు, లేదు అంటే ఆ పనిని ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు ఆది.  అలాంటి ఆదికి అదే రైళ్లో వర్ష(రాశిఖన్నా) కలుస్తుంది. వెంటనే ఆధికి తొలిప్రేమ కలుగుతుంది. ఇంత అందంగా వున్నావేంటి అంటూ... ఆమెను హగ్ చేసుకుంటాడు. అయితే వర్ష పక్కన వాళ్ల నాన్న వుండటంతో... ఆధిని వదులుకుని వెళ్లిపోతుంది. కానీ అతనిపై ప్రేమ పెంచుకున్న వర్ష ఆది కోసం తను చేరిన కాలేజీలో చేరుతుంది. అయితే కాలేజీలోనే ఇద్దరూ బ్రేకప్ అవుతారు. కాలేజీ నుంచి స్టోరీ లండన్ కు ఎందుకు మారింది.. ఆరేళ్ల పాటు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది.. చివరకు

 

విశ్లేష‌ణ‌:

ఫస్ట్ పాయింట్... అమ్మాయిలు వరుణ్ తేజ్ కోసం.. అబ్బాయిలు రాశిఖన్నా కోసం పడిపోవాల్సిందే. సెకండ్ పాయింట్.. కథ పర్ ఫెక్ట్ గా ఎక్కడా లూ పోల్స్ కనిపించకుండా సాగి సూపర్ గా క్లైమాక్స్ లోకి రావటం. ప్రేమ ప్రధాన ఎలిమెంట్ అయినా.. అసలు ఆ ప్రేమ, కోపం, ఇష్టం, ద్వేషం ఇలాంటి ఎమోషన్స్ మనుషుల్ని ఎక్కడిదాక తీసుకెళ్తాయో, పరిణామాలు ఎలా వుంటాయో... జెన్యూన్ రీజన్స్ తో ఎమోషన్స్ రైజ్ చేసి చివరకు కన్విన్సింగ్ గా  క్లైమాక్స్ సెట్ చేశాడు దర్శకుడు  వెంకీ అట్లూరి. తొలిసారే అయినా ఆ లోటు కనిపించదు.  కాలేజీ లవ్, మెచూర్డ్ లవ్, ఫ్రెండ్ షిప్, తల్లి ప్రేమ, అక్కా తమ్ముడి ప్రేమ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను పర్ ఫెక్ట్ గా సెల్యులాయిడ్ పై బంధించి అద్భుతంగా తీశారు తొలి ప్రేమ చిత్రాన్ని.

 

ముఖ్యంగా లీడ్ రోల్ ఆదిగా నటింటిన వరుణ్ విషయానికొస్తే ఫిదాలో ఎన్నారై యువ‌కుడిగా, ప‌రిణితితో కూడుకున్న పాత్ర‌లో క‌న‌ప‌డ్డ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తొలి సినిమా అయినా చక్కగా తీసిన మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ఫస్టాఫ్ లో ప్రేమను అలా పరిచయం చేసిన దర్శకుడు వెంకీ సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ చెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. వెంకీ అట్లూరి క‌థకు త‌మ‌న్ త‌న సంగీతం, నేప‌థ్య సంగీతంతో బ‌లాన్ని చేకూర్చాడు. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా తెర‌పై చూపించాడు.

 

ఇక ఈ మూవీలో సీనియర్ నరేష్ కులం కోసం పాకులాడే తండ్రి పాత్రలో బాగా నటించారు. తన కూతురిని ప్రేమించిన వాడికి ఇవ్వకుండా తమ కులం వాడికే ఇవ్వాలన్నది ఆయన సంకల్పం. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా కులం గొడవలు మనకెందుకు అంకుల్.. అంటూ వరుణ్ తేజ్ కన్విన్స్ చేసినా వినరు. అయితే రాశిఖన్నా.. అన్నీ మరిచిపోయినా... తన ప్రేమను తనకివ్వలేదన్న విషయం మీ కూతురు లైఫ్ లో మరవలేదని, ప్రేమ గుర్తుండదని, కానీ తన ప్రేమను విడదీస్తే.. లైఫ్ లాంగ్ మిమ్మల్ని తండ్రిగా ద్వేషిస్తుందని, అది గుర్తుపెట్టుకోవటం దారుణం కదా అని చెప్తుంది. అలా సామాజిక న్యాయం సబ్జెక్ట్, హైపర్ ఆది కామెడీ ఆకట్టుకున్నాయి.

చివరగా.... ఓ చక్కని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తొలిప్రేమ. అన్ని ఎలిమెంట్స్ పర్ ఫెక్ట్ గా కలిసాయి.